నాగ్ కి నచ్చిందా? అయితే ఓకె!!

నాగార్జున తన కొడుకు అఖిల్ విషయంలో తీసుకొని జాగ్రత్తలు లేవు. అఖిల్ ని ఎలాగైనా స్టార్ హీరోని చెయ్యాలని నాగార్జున కంకణం కట్టుకున్నాడు. తాజాగా డిజాస్టర్ డైరెక్టర్ [more]

Update: 2020-04-12 07:28 GMT

నాగార్జున తన కొడుకు అఖిల్ విషయంలో తీసుకొని జాగ్రత్తలు లేవు. అఖిల్ ని ఎలాగైనా స్టార్ హీరోని చెయ్యాలని నాగార్జున కంకణం కట్టుకున్నాడు. తాజాగా డిజాస్టర్ డైరెక్టర్ బొమ్మారిల్లు భస్కర్ చేతిలో పెట్టిన అఖిల్ సినిమాని.. నాగ్ పై ఎత్తున కూర్చుని ఇంకా పర్యవేక్షిస్తున్నాడట. ఇంతకుముందే విక్రమ్ కుమార్, వెంకీ అట్లూరి సినెమాలప్పుడు కూడా నాగార్జున సినిమా రష్ చూసి మార్పులు చేర్పులు చెప్పాడని.. ఇంకా డైరెక్షన్ డిపార్మెంట్ లోను, ఎడిటర్ టేబుల్ మీద నాగ్ వేళ్ళు పడ్డాయని టాక్ నడిచింది.

అయితే అఖిల్ – పూజ హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా విషయంలోనూ బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా సూచనలే ఇచ్చాడట నాగ్. ఇక ఇప్పటివరకు అయిన షూటింగ్ రష్ చూసి కొన్ని మార్పులు చెప్పాడని అన్నారు. తాజాగా లాక్ డౌన్ నడుస్తున్న కారణంగా నాగార్జున ఫ్రీగా ఉండడం.. అఖిల్ సినిమా షూటింగ్ చివరిలో ఉండడంతో నాగార్జున మొత్తం రష్ చూసి టోటల్ అవుట్ పుట్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారని చెబుతున్నారు. సినిమా షూటింగ్ కొంత లేట్ అయినప్పటికీ అఖిల్ కి సరైన సినిమా పడిందనే అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారని అంటున్నారు. ఇక సినిమాలో పూజ హెగ్డే – అఖిల్ ల రొమాంటిక్ సన్నివేశాలు హైలెట్ అనే టాక్ వినబడుతుంది.

Tags:    

Similar News