అఖిల్ మంచి ఛాన్స్ మిస్ చేశాడా..?

అక్కినేని అఖిల్ గత ఏడాది డిసెంబర్ లో హలో సినిమా విడుదల చేస్తే యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా డిసెంబర్ కల్లా తన [more]

Update: 2018-12-25 10:02 GMT

అక్కినేని అఖిల్ గత ఏడాది డిసెంబర్ లో హలో సినిమా విడుదల చేస్తే యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా డిసెంబర్ కల్లా తన మూడో సినిమా మిస్టర్ మజ్ను షూటింగ్ పూర్తైనా విడుదల చేయలేదు. డిసెంబర్ కలిసి రాదులే… ఎందుకు అని వెనక్కి తగ్గడం ఒక కారణం. పడి పడి లేచే మనసు, అంతరిక్షం మూవీల మీదకి పోటీకి వెళ్లి ఎందుకు చేతులు కాల్చుకోవాలి అనుకుని తన మిస్టర్ మజ్నుని ముందుగా డిసెంబర్ అన్నవాడల్లా… తర్వాత జనవరికి పోస్ట్ పోన్ చేసేసాడు. అయితే అఖిల్ భయపడ్డట్టుగా ఇప్పుడు పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలు హిట్ లిస్ట్ లోకి వెళ్లలేదు. కేవలం యావరేజ్ లతోనే సరిపెట్టుకున్నారు.

ధైర్యం చేసి దిగితే అయిపోయేది…

అయితే అఖిల్ ధైర్యం చేసి దిగిపోతే బాగా కలిసొచ్చేదంటున్నారు అక్కినేని అభిమానులు. అటు తమిళ మారి 2, ఇటు కెజిఎఫ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటు చూస్తే రెండు తెలుగు సినిమాలు అంతగా లేవు. అసలు ఈ టైంని అఖిల్ ఉపయోగించుకుని ఉంటే బాగుండేదంటున్నారు. శర్వా కి, వరుణ్ కి యావరేజ్ లు పడ్డాయి. కెజిఎఫ్ బాగుందని అన్నారు కానీ.. కలెక్షన్స్ లేవు. ఇక మారి 2 ఈ మూడు సినిమాల్లో కొట్టుకుపోయింది.

మణికర్ణికతో పోటీ పడతాడా..?

మరి ఈ క్రిస్మస్ కి ఏ ఒక్క సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా లేకపోవడంతో.. అఖిల్ ఇప్పుడు బాధపడుతున్నాడు. అయ్యో ఈ డిసెంబర్ ని వాడేసుకుంటే అయిపోయేది… కానీ జనవరి 25 కి మణికర్ణికతో పెట్టుకుని నెగ్గగలమా అనే ఆలోచనలో ఉన్నాడట. మరి వెంకీ అట్లూరి తొలిప్రేమ హిట్ తో మిస్టర్ మజ్ను మీద అంచనాలున్నాయి కానీ… అఖిల్ మీదే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. చూద్దాం అఖిల్ జనవరిలో ఎలాంటి హిట్ అందుకుంటాడా అనేది.

Tags:    

Similar News