చైతు ప్లేస్ లోకి అఖిల్..!

నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో బంగార్రాజు సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. సోగ్గాడే చిన్నినాయనాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఓ గెస్ట్ [more]

Update: 2019-04-10 07:32 GMT

నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో బంగార్రాజు సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. సోగ్గాడే చిన్నినాయనాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఓ గెస్ట్ రోల్ లో నాగ చైతన్య కూడా నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే మజిలీ హిట్ తర్వాత నాగ చైతన్య కన్నా నాగ్ కి మనవడి పాత్రలో అఖిల్ అయితే బాగుంటాడని.. నాగ చైతన్య ప్లేస్ లోకి అఖిల్ ని తీసుకునే ఆలోచనలో నాగార్జునతో పాటుగా బంగార్రాజు చిత్ర బృందం ఉందట. మజిలీ లాంటి ఎమోషనల్ హిట్ తర్వాత నాగ చైతన్యతో ఈ పాత్ర చేయించడం కరెక్ట్ కాదని నాగ్ భావనగా చెబుతున్నారు.

అఖిల్ క్రేజ్ పెంచేలా..!

ఎలాగూ అఖిల్ కి ఇంతవరకు హీరోగా బ్రేక్ రాలేదు. అందుకే ఈ బంగార్రాజుతో అఖిల్ క్రేజ్ మరింత పెరిగేలా అఖిల్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో డిజైన్ చేయమని కళ్యాణ్ కృష్ణ కి నాగ్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక అఖిల్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇంకా పట్టాలెక్కించలేదు. మరి నాగార్జున, అఖిల్ ఒకే సినిమాలో కనబడితే అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వీరి కాంబో మీద త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో నాగార్జునకి హీరోయిన్ గా నయనతారని పట్టుకొచ్చే ప్రయత్నాల్లో కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు. కానీ నయనతార బిజీగా ఉండటం వల్ల బంగార్రాజులో నాగ్ సరసన నటిస్తుందో లేదో కాస్త డౌటే. మరి చివరికి నాగ్ కి అనుష్కనే సెట్ అయ్యేలా ఉందనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.

Tags:    

Similar News