అందులో నిజమెంతుందో?

Update: 2018-07-12 02:39 GMT

నిన్న బుధవారం సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే అఖిల్ 3 వ సినిమా షూటింగ్ అనుకున్న విధముగా సాగడం లేదు. కారణం అఖిల్ అంటూ బోలెడన్ని టైటిల్స్ తో ఈ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరి అందులో నిజమెంతుందో తెలియదు గాని... అఖిల్ 3 విషయంలో మాత్రం ఈ బయటికొచ్చిన న్యూస్ తో ఎంతోకొంత డ్యామేజ్ తప్పదనేలా ఉంది. అసలింతకీ విషయమేమిటంటే.... అఖిల్ 3 ని తెరకెక్కిస్తున్న వెంకీ అట్లూరి కి తొలిప్రేమ విజయంతో... అఖిల్ ని తెరకెక్కించే అవకాశం కలిగింది. అందుకే అఖిల్ తో వెంకీ అట్లూరి తాను అనుకున్న ప్రేమ కథతోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి సెట్స్ మీదకెళ్ళాడు.

కొద్దీ రోజుల క్రితమే ప్రారంభమైన అఖిల్ 3 షూటింగ్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందంటున్నారు. అఖిల్ కి రెండు సినిమాల అనుభవం ఉంది. అఖిల్, హలో సినిమాల్లో అఖిల్ డిజాస్టర్ కాగా... హలో సినిమా యావరేజ్ అయ్యింది. అయితే ఆ అనుభవంతోనే అఖిల్ ఇప్పుడు తన మూడో సినిమా విషయంలో వేలు పెడుతున్నాడట. వెంకీ అట్లూరి దర్శకుడిగా ఒకే ఒక్క సినిమా అనుభవం ఉంది. అయితే అఖిల్ తాను చెప్పిన విధంగా కాకుండా దర్శకుడు వెంకీ తాను కోరుకున్నట్టు మార్పులు చేసుకుని స్క్రిప్ట్ ని ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కిస్తున్నాడట. అయితే ఈ విషయంలో అఖిల్ బాగా హార్ట్ అయ్యాడట. అందుకే రెండు మూడు రోజులపాటు షూటింగ్ కి రాకుండా ఎగ్గొట్టాడట.

ఇక తనకి ఆరోగ్యం బాగోకే... షూటింగ్ కి రావడం లేదనే ఒక వంక పెట్టాడని... అఖిల్ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులకు ఒప్పుకోనందువల్లే ఇలా జరిగిందనే టాక్ ఒక రేంజ్ లో నడుస్తుంది. ఇక వెంకీ అట్లూరి కూడా అఖిల్ చెప్పిన మార్పులు చేర్పులు ఒప్పుకోకపోవడానికి కారణం అవుట్ ఫుట్ అనుకున్న విధంగా రాదనీ సోల్ దెబ్బ తింటుందని భావిస్తున్నాడట. అందుకే అఖిల్ చెప్పిన మార్పులు చెయ్యకుండా తన పని తాను చేసుకుపోతున్నాడట. మరి ఈ విషయంలో నిజమెంతుందో తెలియదు గాని.. ఈ న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో బాగా స్ప్రెడ్ అయ్యింది. అయినా స్టార్ హీరోలు స్క్రిప్ట్ లో వేలు పెట్టారనే న్యూస్ ఇప్పటివరకు విన్నాం కానీ... ఇప్పుడు కేవలం రెండే సినిమాలు అనుభవమున్న హీరో ఇలా చెయ్యడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. అయినా స్టార్ హీరోల కొడుకులకు ఇలాంటివి కామన్ అనే టాక్ కూడా నడుస్తుంది లెండి అది వేరే విషయం. మరి ఈ న్యూస్ నిజం కాదు రూమర్ అనే విధంగా మూవీ టీమ్ అంటే అఖిల్ తో కలిసి వెంకీ అట్లూరి ఏమన్నా ఒక సెల్ఫీ దిగి పంపితే బావుంటుంది. లేకపోతె అది నిజమనుకునే ప్రమాదముంది అనే సెటైర్స్ స్టార్ట్ అయ్యాయి కూడా..!

Similar News