అఖిల్ ఓపెనింగ్స్ కు ఎంత తీసుకుంటాడో తెలిస్తే షాక్..

Update: 2018-06-07 04:17 GMT

అక్కినేని అఖిల్ 'మనం' సినిమాతో కామియో రోల్ చేసి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వినాయక్ డైరెక్షన్ లో 'అఖిల్' అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో 'హలో' సినిమా చేశాడు. అది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఐన యూత్ లో మాత్రం అఖిల్ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. తన బ్రాండ్ వేల్యూ కూడా పెరగడంతో ఏమైనా ఓపెనింగ్స్ కి వెళ్తే లక్షల్లో డబ్బులు వసూల్ చేస్తున్నాడంట. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా అఖిల్ హైదరాబాద్ లో ఓ జిమ్ ఓపెనింగ్ కు హాజరయ్యాడు. ఆ కార్యక్రమానికి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా హాజరైంది.

ఈ ఓపెనింగ్ ఫంక్షన్ కి అఖిల్ కనీసం 20 నిముషాలు కూడా లేడు. ఆ ఫంక్షన్ కు హాజరైనందుకు అఖిల్ రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడట. అతను హీరో అవ్వకముందు కొన్ని యాడ్స్ చేసాడు. మౌంటైన్ డ్యూ, టైటాన్ వాచ్ లకు అఖిల్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. ఇక నిన్న కొత్తగా బిగ్ సీ 200 వ స్టోర్ ను హైదరాబాద్ లో లాంచ్ చేశాడు. ప్రస్తుతం అఖిల్.. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లవ్ స్టోరీ జోనర్ లో ఓ సినిమా చేస్తున్నాడు

Similar News