అఖిల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందే

అక్కినేని అఖిల్ హీరోగా చేసిన మూడు సినిమాలు మూడు రకాలుగా ప్లాప్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు కూడా అఖిల్ డిజాస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ [more]

Update: 2020-02-03 05:05 GMT

అక్కినేని అఖిల్ హీరోగా చేసిన మూడు సినిమాలు మూడు రకాలుగా ప్లాప్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు కూడా అఖిల్ డిజాస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నా #అఖిల్4 షూటింగ్ చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక్కపోతే ఇప్పటివరకు అఖిల్4 అప్ డేట్ ఇవ్వలేదు కానీ.. రేపు సాయంత్రం #అఖిల్4 టైటిల్ ఎనౌన్సమెంట్ ఉందని అంటున్నారు. అయితే ఈలోపు అఖిల్ కొత్త సినిమా టైటిల్ ఒకటి ప్రచారం లోకి వచ్చేసింది.

అఖిల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా… అఖిల్ కొత్త సినిమా టైటిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ గా పెట్టినట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 4 సాయంత్రం 5:15 గంటలకు చిత్ర బృందం బృందం అధికారిక ప్రకటన చేయనుంది. మరి అఖిల్ ని చూస్తుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపిస్తాడు. అందుకే అఖిల్ కి ఈ టైటిల్ చాలా బాగా సెట్ అయినట్లుగా అనిపిస్తుంది. మరి ‘అఖిల్, హలో, మిస్టర్ మజ్ను’ ల వలన నష్టపోయిన అఖిల్ ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో అయినా గట్టెక్కాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

Tags:    

Similar News