ఇది మరీ కామెడీ గురు

నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ – వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను టాక్ కొత్తగా చెప్పేదేముంది. అఖిల్ కి హ్యాట్రిక్ డిజాస్టర్ [more]

Update: 2019-01-26 02:22 GMT

నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ – వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను టాక్ కొత్తగా చెప్పేదేముంది. అఖిల్ కి హ్యాట్రిక్ డిజాస్టర్ అంటూ సినిమా చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా మొదటి షోకే యావరేజ్ టాక్ ని… ఈవెనింగ్ కి నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకున్న మిస్టర్ మజ్ను అస్సలు ఆకట్టుకునేలా లేదని.. ఈ సినిమాకి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. అసలే అంతంత మాత్రంగా వున్న బుకింగ్స్ ఇపుడు మిస్టర్ మజ్నుకి వచ్చిన టాక్ తో థియేటర్స్ మరింత వెలవెలబోతున్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అఖిల్ ముచ్చటగా మూడోసారి ప్లాప్ కొట్టాడని.. అఖిల్, హలో ఇప్పుడు మిస్టర్ మజ్ను ప్లాప్ అంటూ అఖిల్ మీద కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఇంతటి నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకి సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటే కాస్త కామెడీగా ఉంటుంది కదా.. మిస్టర్ మజ్ను టీం లో నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారు, దర్శకుడు వెంకీ అట్లూరి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరో అఖిల్, హీరోయిన్ నిధి లు కలిసి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొని తమ సినిమాకి వస్తున్న ఆదరణకు ప్రెస్ సాక్షిగా మురిసిపోయారు. మరి సినిమాకి నెగెటివ్ టాక్ రావడమే ఈ హడావిడి సక్సెస్ సెలెబ్రేషన్స్ కి కారణమంటున్నారు. టీం మొత్తం కలిసి సినిమా హిట్ అంటే మాత్రం ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చేస్తారా.. ఏదైనా అఖిల్ మాత్రం మూడో సినిమాతో కూడా ప్లాప్ అందుకున్నాడనే చెప్పాలి

Tags:    

Similar News