తెలుగులోకి అజిత్ ‘విశ్వాసం’

`వీరం`, `వేదాళం`, `వివేకం` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజీత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా `విశ్వాసం`. ఇటీవ‌ల త‌మిళ‌నాట [more]

Update: 2019-02-21 07:31 GMT

'వీరం', 'వేదాళం', 'వివేకం' వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజీత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా 'విశ్వాసం'. ఇటీవ‌ల త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అజీత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని స‌త్య‌జ్యోతి ఫిలింస్ తో కలిసి ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ ప‌తాకంపై ఆర్‌.నాగేశ్వ‌ర‌రావు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌కి చెందిన విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. అనువాద కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుద‌ల చేయ‌నున్నారు.

Tags:    

Similar News