అజీత్ పక్కన స్టైలిష్ విలన్ కుమ్మేసాడు..!

కోలీవుడ్ నటుడు అజీత్ ప్రస్తుతం శివ డైరెక్షన్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. ‘విశ్వాసం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ [more]

Update: 2019-01-01 07:53 GMT

కోలీవుడ్ నటుడు అజీత్ ప్రస్తుతం శివ డైరెక్షన్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. ‘విశ్వాసం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. శివ – అజీత్ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం. అంతకుముందు వచ్చిన ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’ మంచి సక్సెస్ అందుకున్నాయి. వీరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అజీత్ ను మాస్ ప్రేక్షకులు ఎలా ఇష్టపడతారో ఆ విధంగా డైరెక్టర్ శివ చూపించాడు. ట్రైలర్ లో అజీత్ హీరోగా కనిపిస్తే విలన్ గా జగపతి బాబు కనిపించాడు.

స్టైలీష్ లుక్ లో జగపతి బాబు

విలన్ గా జగపతి బాబు లుక్ అందరికీ ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ లో జగపతి బాబు మరింత యంగ్ గా.. స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. పాత్ర పరంగా ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో స్టైలిష్ విలన్ గా కనిపించిన జగపతి మరో సారి ‘విశ్వాసం’లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జగపతి బాబు తమిళంలో విలన్ గా మరింత బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలరే ఇలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగు ట్రైలర్, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో డేట్స్ ప్రకటించలేదు.

Tags:    

Similar News