అజీత్ మాస్ అంటే ఇదేనేమో..!

మాస్ ఫాలోయింగ్ ఉన్న తమిళ స్టార్ హీరో అజిత్ రీసెంట్ గా ‘విశ్వాసం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొన్నేళ్ల నుండి మాస్ అభిమానుల్ని [more]

Update: 2019-01-31 12:57 GMT

మాస్ ఫాలోయింగ్ ఉన్న తమిళ స్టార్ హీరో అజిత్ రీసెంట్ గా ‘విశ్వాసం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొన్నేళ్ల నుండి మాస్ అభిమానుల్ని అలరించే అంశాలు ఉండేలా చూసుకుంటున్న అజీత్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా నిరూపించాడు. అజీత్ -శివ కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమాల్లో రెండు సూపర్ హిట్ అవ్వగా ఒకటి డిజాస్టర్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. రొటీన్ కథతో తెరకెక్కించిన ఈ సినిమాకు అంతగా గొప్ప టాక్ ఏమి రాకపోయినా సంక్రాంతి సీజన్‌ను పూర్తిగా ఉపయోగించుకుని మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది.

200 కోట్ల మార్క్…

ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటడం విశేషం. విడుదలైన 20 రోజుల్లో ఈ సినిమా రూ.160 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా… మిగతా ఏరియాలన్నీ కలిపి 60 కోట్లకు పైగా వసూళ్లు చేయడం విశేషం. ఓవరాల్ గా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటి రికార్డు క్రియేట్ చేసింది. పోటీలో రజనీ ఉన్నప్పటికీ ‘విశ్వాసం’ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడాన్ని బట్టి అజీత్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News