ఇది.. ఈ హీరో డెడికేషన్!!

తమిళ హీరో అజిత్ అంటే పడిచచ్చిపోయే ఫాన్స్ ఎందుకు ఉంటారో అనేది కొన్ని విషయాలను చూస్తే అర్ధమవుతుంది. తాజాగా వాలిమై షూటింగ్ లో అజిత్ గాయపడినట్లుగా.. హైదరాబాద్ [more]

Update: 2020-11-24 07:26 GMT

తమిళ హీరో అజిత్ అంటే పడిచచ్చిపోయే ఫాన్స్ ఎందుకు ఉంటారో అనేది కొన్ని విషయాలను చూస్తే అర్ధమవుతుంది. తాజాగా వాలిమై షూటింగ్ లో అజిత్ గాయపడినట్లుగా.. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్నా ప్రాంతంలో అజిత్ కి స్పాట్ లో గాయాలవగా.. అజిత్ ని వెంటనే చెన్నైకి తరలించినట్టుగా వార్తలొచ్చాయి. అజిత్ గాయాల అవడంతో ఈ వాలిమై షూటింగ్ ఒక నెల రోజులు వాయిదా పడుతుంది అంటూ ప్రచారం జరిగింది. అజిత్ కి బైక్ రేసింగ్ అంటే ఎంతిష్టమో అనేది సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అయితే తన వాలిమై షూటింగ్ కోసం అజిత్ తన సొంత బైక్ తో ఆ సినిమాలో నటించడానికి చెన్నై నుండి హైదరాబాద్ కి బైక్ తెప్పించుకున్నాడు.వాలిమై షూటింగ్ లో అజిత్ కి చేతికి, వేళ్లకు గాయాలయ్యాయి. వెంటనే అజిత్ హాస్పిటల్ కి వెళ్ళాడు. దానితో షూటింగ్ వాయిదా పడుతుంది అనుకుంటే.. తాజాగా అజిత్ తన గాయాల వలన షూటింగ్ వాయిదా వెయ్యొద్దు అని, తాను షూటింగ్ కి రెడీ అని చెప్పడంతో చిత్ర బృందం అజిత్ డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు. మరి కరోనా వలన నిర్మాతలు ఎంతగా నష్టపోయారో చూసిన సందర్భాల్లో అజిత్ ఇప్పుడు తన వలన షూటింగ్ ఆగడం అనేది నచ్చక అజిత్ తన గాయాలను లెక్కచెయ్యకుండా ఇలా షూటింగ్ కి హజారవడం అనేది సూపర్. అందుకే అజిత్ అభిమానులకి అజిత్ దేవుడు అయ్యింది.

Tags:    

Similar News