అజిత్ మళ్లీ అదే పాత్రలో..!

మన సౌత్ హీరోస్ కి పోలీస్ పాత్రలు అంటే ఎంత ఇష్టమో. ఏదైనా పోలీస్ పాత్ర వస్తే మన హీరోస్ ఏమీ ఆలోచించకుండా ఓకే చేసేస్తున్నారు. ఎవరైనా [more]

Update: 2019-05-30 08:44 GMT

మన సౌత్ హీరోస్ కి పోలీస్ పాత్రలు అంటే ఎంత ఇష్టమో. ఏదైనా పోలీస్ పాత్ర వస్తే మన హీరోస్ ఏమీ ఆలోచించకుండా ఓకే చేసేస్తున్నారు. ఎవరైనా దర్శకుడు పోలీస్ పాత్రను, దానికి తగిన మంచి కథను చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు మన హీరోస్. కొందరు హీరోలు పోలీస్ పాత్రలు ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టవు. అందులో ఒక్కరు అజీత్ కుమార్. ఇప్పటికే పలుసార్లు పోలీస్ పాత్రలు చేసిన అజీత్ మరోసారి పోలీస్ పాత్ర వేయనున్నారు. ప్రస్తుతం అజీత్ హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమాను తమిళంలో రీమేక్ లో నటిస్తున్నారు.

మళ్లీ ఒకే డైరెక్టర్ తో…

దీన్ని హెచ్.వినోత్ డైరెక్షన్లో అజీత్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అవ్వగానే వినోత్ దర్శకత్వంలోనే ఇంకో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అజీత్. ఇందులో అజీత్ ది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలుస్తోంది. అజీత్ కి ఓ అలవాటు ఉంది. తనకి ఎవరైనా డైరెక్టర్ నచ్చితే వెంటనే అతనితో సినిమాలు చేయడం అలవాటు. అలానే గతంలో శివతో వరుస సినిమాలు చేశాడు. ఇప్పుడు అజీత్ వినోత్‌కు రెండవసారి అవకాశం ఇవ్వడానికి అతని ప్రతిభతో పాటు అతను చెప్పిన పోలీస్ కథ కూడా ఒక కారణమని అంటున్నారు.

Tags:    

Similar News