#RRR లో బాలీవుడ్ స్టార్ హీరో

Update: 2018-11-22 04:13 GMT
Ram Charan Junior NTR Rajamouli #RRR

టాలీవుడ్ లో మొన్నటి వరకు బాహుబలి ఫీవర్. బాహుబలి వచ్చాక ఇప్పుడు #RRR ఫీవర్. #RRR మూవీ కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. #RRR నుండి రోజుకొక న్యూస్ బయటికి వస్తూ సినిమా మీద ఎక్సపెక్టషన్స్ పెంచేస్తుంది. 'బాహుబలి' సినిమాతో నేషనల్, ఇంటర్నేషనల్ డైరక్టర్ అయ్యాడు రాజమౌళి. బాలీవుడ్ లో తెలుగు సినిమాకు మార్కెట్ రావాలంటే అక్కడ స్టార్స్ పెట్టి సినిమా చేయాలి. అందుకే శంకర్, రజనీ కలిసి అక్షయ్ కుమార్ ను విలన్ గా రోబో 2.0 లో తీసుకున్నారు.

అయితే ఇప్పుడు రాజమౌళి కూడా అదే చేయనున్నాడు. 'బాహుబలి' లో విలన్ గా రానా ని పెట్టాడు. రానా అంటే బాలీవుడ్ లో తెలుసు కాబట్టి వర్క్ అవుట్ అయింది. ఇప్పుడు #RRR లో రామ్ చరణ్ ఉన్న సరిపోదు. అక్కడ మార్కెట్ ను సెట్ చేయాలంటే అక్కడి స్టార్ ని పెట్టి చేయాల్సిందే. అందుకే జక్కన్న ఓ ప్లాన్ వేసాడట.

బాలీవుడ్ లో వందల కోట్ల రేంజ్ లో మార్కెట్ చేయాలంటే అక్కడి స్టార్ #RRR సినిమాలో అవసరం అని విలన్ గా అజయ్ దేవగన్ ను పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని నిజమే అంటున్నారు సినీ జనాలు. అజయ్ దేవగన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద దృష్టి వుంది. గతంలో చంద్రబాబును కూడా కలిసాడు. అయితే రాజమౌళి నిర్ణయానికి అజయ్ ఎస్ చెబుతాడా? నో చెబుతాడా? చూడాలి. రాజమౌళి సినిమా అంటే ఎవరు నో అంటారు చెప్పండి

Similar News