అన్ని కోట్లు వదులుకున్నాడా?

రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తో సహా… తమిళం నుండి సముద్ర [more]

Update: 2020-02-07 07:56 GMT

రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తో సహా… తమిళం నుండి సముద్ర ఖని వరకు నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమాల్లో అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. హీరోలతో సమానమైన క్రేజ్ హీరోయిన్స్ కి విలన్స్ కి కూడా ఉంటుంది. అయితే #RRR మల్టీస్టారర్ కోసం రాజమౌళి బాలీవుడ్ నుండి ఓ కీలక పాత్ర కోసం అజయ్ ని తీసుకున్నారు. ఈ సినిమాలో అజయ్ పాత్ర 30 నిమిషాల పాటు ఉంటుంది అని.. అయితే అజయ్ దేవగన్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఇచ్చినంత పారితోషకం ఉంటుంది అని ప్రచారం జరిగింది. అజయ్ బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరో కాబట్టి.. ఎన్టీఆర్, చరణ్ ల పారితోషకం అంతే ఇస్తామన్నారట.

#RRR నిర్మాతలు అజయ్ దేవగణ్ క్రేజ్ దృష్ట్యా 25 కోట్ల అందమైన పే చెక్‌ను ఆఫర్ చేసినప్పటికీ… #RRR నిర్మాతలను, యూనిట్ ఆశ్చర్యం కలిగించే విధంగా… అజయ్ ఈ పారితోషకం ప్రతిపాదనను తిరస్కరించాడని.. అసలు #RRR కోసం పైసలు కూడా వసూలు చేయనని స్పష్టం చేసాడట. రాజమౌళి దర్శకత్వంలో నటించడం తన కల అని, అది #RRR తో నెరవేరిందని.. ఇంత గొప్ప సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చినందుకు సంతోషించాలి కానీ డబ్బుతో.. దాన్ని పోల్చి చూడకూడదని అని చెప్పడంతో.. నిర్మాతలతో పాటుగా చిత్ర బృందం మొత్తం షాకయ్యిందట. మరి భారీ బడ్జెట్ సినిమాలో అజయ్ దేవగన్ అంతసేపు ఫ్రీగా నటించడం కేవలం రాజమౌళి తో స్నేహం వలనే అంటున్నారు.

Tags:    

Similar News