బాలీవుడ్ లో ఈ హీరో గురించే మాట్లాడుకుంటున్నారు!

గత శుక్రవారం తెలుగు లో సినిమాల హడావిడి పెద్దగా లేదు కానీ బాలీవుడ్ లో రిలీజ్ అయిన చిచోరే అనే సినిమా గురించే మన తెలుగు వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు. సుశాంత్ [more]

Update: 2019-09-09 09:42 GMT

గత శుక్రవారం తెలుగు లో సినిమాల హడావిడి పెద్దగా లేదు కానీ బాలీవుడ్ లో రిలీజ్ అయిన చిచోరే అనే సినిమా గురించే మన తెలుగు వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు. సుశాంత్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఈ మూవీలోనూ శ్రద్దా కపూరే హీరోయిన్ కావడం మరో విశేషం. ఇటీవలే ఆమె నటించిన సాహో అక్కడ బారీగా రిలీజ్ అయ్యి పర్లేదు అనిపించుకుంది. ఇక చిచోరే సినిమాలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కీలక పాత్ర పోషించిన నవీన్ పోలిశెట్టికి ఇదే అక్కడి డెబ్బయ్యవ మూవీ.

మొదటి సినిమాతోనే…

మన తెలుగు లో నవీన్ పోలిశెట్టి చేసిన మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగు లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన నవీన్ హిందీ లో కూడా తన మొదటి సినిమాతో హిట్ అందుకున్నాడు. లెన్త్ విషయంలో మెలో డ్రామా విషయంలో కొంత మిక్స్డ్ టాక్ ఓవరాల్ గా మంచి టైంపాస్ మూవీ అని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ సీన్స్ ఎమోషనల్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నవీన్ యాక్షన్ కి చాలామంది ఫిదా అయిపోయారు. దాంతో మనోడికి అక్కడ మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశముందని అక్కడ బాలీవుడ్ మీడియా వారు చెప్పుకుంటున్నారు.

 

 

 

Tags:    

Similar News