మెగా ఫ్యామిలీని వదలవా సురేందర్

మెగా హీరోలు అల్లు అర్జున్ తో రేసు గుర్రం సినిమా తీసాక.. రామ్ చరణ్ తో ధ్రువ తీసిన దర్శకుడు సురేందర్ రెడ్డి… ఏకంగా చిరంజీవిని డైరెక్ట్ [more]

Update: 2019-11-11 08:28 GMT

మెగా హీరోలు అల్లు అర్జున్ తో రేసు గుర్రం సినిమా తీసాక.. రామ్ చరణ్ తో ధ్రువ తీసిన దర్శకుడు సురేందర్ రెడ్డి… ఏకంగా చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. సై రా నరసింహారెడ్డి తో చిరు పుణ్యమా అని ఇండియా వైడ్ గా అందరికి పరిచయమయ్యాడు. సై రా సినిమా హిట్ అనిపించుకుంది. అయితే సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చేస్తాడనే ప్రచారం జరిగింది. ప్రభాస్ కోసం కథ రెడీ చేసి వినిపించాడని, ప్రభాస్ కూడా ఇంప్రెస్ అయ్యాడని అన్నారు. మరోపక్క సురేందర్ రెడ్డి చిన్న సినిమాలకు నిర్మాతగా మారుతున్నాడనే న్యూస్ వచ్చింది.

అయితే తాజాగా ప్రభాస్ కి చెప్పిన కథతో మరో మెగా హీరోని సురేందర్ రెడ్డి తగులుకున్నాడనే న్యూస్ నడుస్తుంది. ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఎలాగూ టైం పడుతుంది.. ఈలోపు లో మరో చిన్న సినిమా చేద్దామని సురేందర్ రెడ్డి ఫిక్స్ అయ్యాడట. వాల్మీకితో బంపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ తో సురేందర్ రెడ్డి సినిమా చేయబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. వరుణ్ తేజ్ కి సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో.. సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి సురేందర్ రెడ్డి ఇలా మెగా కాంపౌండ్ లోనే సినిమాలు కానిచ్చేసేలా కనబడుతున్నాడని అంటున్నారు

Tags:    

Similar News