ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలివే

సైరా తరువాత టాలీవుడ్ లో చెప్పుకోవడానికి పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. గోపీచంద్ చాణిక్య అలా వచ్చి అలా వెళ్లి పోయింది. ఇక ఈ వారం అంటే [more]

Update: 2019-10-17 08:31 GMT

సైరా తరువాత టాలీవుడ్ లో చెప్పుకోవడానికి పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. గోపీచంద్ చాణిక్య అలా వచ్చి అలా వెళ్లి పోయింది. ఇక ఈ వారం అంటే రేపు మూడు స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో మొదటిగా రాజు గారి గది 3. ఈ మూవీ పై పెద్దగా అంచనాలు లేవు. కానీ కామెడీ తో టైంపాస్ అయిపోతుందని సినీ లవర్స్ భావిస్తున్నారు. హీరోగా అశ్విన్ బాబు హీరోయిన్ గా అవికా గోర్ కి పెద్ద ఇమేజ్ లేకపోవడంతో ఈ సినిమా మౌత్ టాక్ బట్టి ఆడనుంది.

ప్రేక్షకుల ఓటు దేనికో…..?

ఇక సాయి కుమార్ కొడుకు ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా ఇంచుమించు అంతే ఉంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. కాశ్మీరీ పండిట్ లా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రంలా కనిపిస్తుంది. సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప దీని కోసం ప్రేత్యేకించి థియేటర్స్ కి వెళ్ళరు జనాలు. అలానే ఈ రెండిటితో పాటు మరో చిన్న సినిమా కూడా అదే రోజు వస్తోంది. కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే ఈ సినిమా గురించి ఎవరికి పెద్దగా అవగాహన కూడా లేదు. అసలు ఈ మూవీ రేపు రిలీజ్ అవుతుందని కూడా ఎవరికి తెలియదు అంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సో సినీ లవర్స్ కి ఈ మూడు మూవీస్ లో ఏం నచ్చుతుందో చూడాలి.

 

Tags:    

Similar News