యాక్షన్ కో దండం అంటున్న ప్రభాస్?

బాహుబలి లో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి లా ప్రభాస్ చేసిన యాక్షన్ మరిచిపోరు. బాహుబలి క్లైమాక్స్ లో రానా, ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్. [more]

Update: 2020-01-01 07:46 GMT

బాహుబలి లో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి లా ప్రభాస్ చేసిన యాక్షన్ మరిచిపోరు. బాహుబలి క్లైమాక్స్ లో రానా, ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్. అలాగే సాహో సినిమా హిట్ కాకపోయినా.. సాహో యాక్షన్ హాలీవుడ్ యాక్షన్ మించి ఉందని అందరూ కితాబునిచ్చారు. సాహో లో కూడా యాక్షన్ హైలెట్ అయ్యింది. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ యాక్షన్ కో దండం అంటున్నాడు. రాధాకృష్ణ సినిమా లో ప్రభాస్ డీసెంట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తాడని ఎప్పుడో అన్నారు. అయితే రాధాకృష్ణ – ప్రభాస్ సినిమా టైటిల్ గా అనుకుంటున్న జాన్ టైటిల్ చూసాక ఫ్యాన్స్ కి ప్రభాస్ యాక్షన్ ట్రీట్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు. అయితే మరోపక్క పిరియాడికల్ మూవీగా ఉండబోతున్న ఈ సినిమాలో ఫైట్స్ కి ప్రాధాన్యత తక్కువే అన్నారు.

తాజాగా సాహో లో యాక్షన్ వర్కౌట్ అవ్వలేదు గనక జాన్ లో యాక్షన్ పక్కనపెట్టేసినట్లుగా తెలుస్తుంది. ఏదో ప్రభాస్ హీరోయిజం కనబడాలంటే ఓ ఫైట్ పెడితే చాలని జాన్ స్క్రిప్ట్ మార్పుల్లో చేర్పుల్లో.. ఉన్న ఫైట్స్ అన్నిటిని పక్కనపెట్టేసినట్లుగా తెలుస్తుంది. కథ మొత్తం ప్రేమ అండ్ ఎమోషనల్ గానే సాగుతుంది అని ఉన్న.. ఒకే ఒక్క యాక్షన్ సీన్ కథ అనూహ్యమైన మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే వస్తుందని అంటున్నారు. మరి నిజంగా ప్రభాస్ మాత్రం సాహో దెబ్బకి చాలా మారాడని అనిపిస్తుంది. ఇక బాగా వెయిట్ లాస్ కూడా అయినట్లుగా మత్తువదలరా టీం తో షేర్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తుంది. ఇక జాన్ సినిమా షూటింగ్ సంక్రాతి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలవుతుందని సమాచారం.

Tags:    

Similar News