ఈసారి ఫ్రీమేక్ ని నమ్ముకున్నాడా?

రవితేజ వరస ప్లాప్స్ తో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే పారితోషకం విషయంలో ప్లాప్స్, డిజాస్టర్స్, హిట్స్ తో పనిలేకుండా డిమాండ్ చేస్తాడు. అవకాశం [more]

Update: 2020-01-27 08:03 GMT

రవితేజ వరస ప్లాప్స్ తో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే పారితోషకం విషయంలో ప్లాప్స్, డిజాస్టర్స్, హిట్స్ తో పనిలేకుండా డిమాండ్ చేస్తాడు. అవకాశం ఉంది ఇస్తారంటూ రెమ్యునరేషన్ లెక్కలు చెబుతాడు. ప్రస్తుతం నాలుగు ప్లాపులతో ఉన్న రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ తో కలిసి నటిస్తున్న క్రాక్ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం బయటికొచ్చిన క్రాక్ పోస్టర్స్ చూస్తే రవితేజ మల్లి ఫామ్ లోకి రావడం ఖాయంగా కనబడుతుంది. అయితే తాజాగా క్రాక్ సినిమా తమిళ సినిమాకి ఫ్రీమేక్ అంటూ ప్రచారం మొదలైంది.

హిట్స్ లేని రవితేజ ఈసారి ఫ్రీమేక్ ని నమ్ముకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమా త‌మిళ సేతుప‌తికి ఫ్రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. తమిళ సేతుపతి కథకి, క్రాక్ సినిమా కథకి దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. అయితే తమిళ సేతుపతి ని గతంలోనే గంటా శ్రీనివాస్ కొడుకు తెలుగులో జయదేవ్ అంటూ రీమేక్ చేసి ప్లాప్ కొట్టాడు. మల్లి అదే సినిమాకి ఫ్రీమేక్ అంటే… కాస్త ఆలోచించదగిన విషయమే. అయితే సేతుపతి కథని రవితేజ పర్సనాలిటి సరిపోయే రీతిలో స్రిప్ట్ రాసుకుని.. ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News