ఇప్పుడు తగ్గకేం చేస్తాడో చూస్తామంటున్నారు

ప్రస్తుతం రవితేజ వరస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ప్లాప్స్ ఉన్నప్పటికీ పారితోషకంలో ఎప్పుడూ రవితేజ ఓ మెట్టు కూడా దిగడు. ఇది రూమర్ కాదు.. అక్షరాలా నిజం. [more]

Update: 2020-01-31 06:19 GMT

ప్రస్తుతం రవితేజ వరస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ప్లాప్స్ ఉన్నప్పటికీ పారితోషకంలో ఎప్పుడూ రవితేజ ఓ మెట్టు కూడా దిగడు. ఇది రూమర్ కాదు.. అక్షరాలా నిజం. ప్రస్తుతం మూడు డిజాస్టర్స్ తో ఉన్న రవితేజ కి డిస్కో రాజా కూడా షాకిచ్చింది. ఓ పక్కన థియేటర్స్ ప్రాబ్లెమ్, మరో పక్క సంక్రాతి సినిమాల హడావిడి ముగియకపోవడం, మరోపక్క సినిమా కొచ్చిన టాక్.. ఇలా డిస్కో రాజాని అన్ని ముప్పేటా దాడి చెయ్యడంతో. ఇప్పుడు డిస్కో రాజాని కొన్న బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇక రవితేజ తో వరస సినిమాలు నిర్మిస్తున్న రామ్ తుళ్లూరు అయితే ఆర్ధికంగా కుదేల్ అయ్యాడు. అమెరికాలో సంపాదించిన డబ్బంతా ఒక్క రవితేజ మీదే పెట్టి పోగొట్టుకుంటున్నారు.

నెల టికెట్ చాచి కొట్టిన… డిస్కో రాజా మీద ఓవర్ బడ్జెట్ పెట్టాడు రామ్ తుళ్లూరు. కానీ ఇప్పుడు రామ్ తుళ్లూరు సేఫ్. డిస్కో రాజా బడ్జెట్ కి సరిపడా థియేట్రికల్ రైట్స్ అమ్మినప్పటికీ.. ఇప్పుడు ఈ సినిమా ప్లాప్ వలన బయ్యర్లకు తిరిగి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు సినిమా డిజాస్టర్స్ వలన ఇప్పుడూ రవితేజ తో సినిమా అంటే భయపడుతున్నారు నిర్మాతలు. ఇక ఇప్పుడు పారితోషకం ఎమన్నా తగ్గించుతుంటే రవితేజ తో సినిమాలు చెయ్యడానికి వస్తారేమో కానీ.. రవితేజ పారితోషకం విషయంలో ఇలాగె ఉంటే మాత్రం అతని తదుపరి సినిమాల విషయంలో కష్టం.

Tags:    

Similar News