నితిన్ కి ఆమె విలనా?

ప్రస్తుతం నితిన్ భీష్మ హిట్ తో పిచ్చ ఆనందంలో ఉన్నాడు. మూడు ప్లాప్స్ తర్వాత వచ్చిన హిట్ సినిమాతో నితిన్ ఉత్సాహంగా మరో సినిమాని లైన్ లో [more]

Update: 2020-02-25 06:07 GMT

ప్రస్తుతం నితిన్ భీష్మ హిట్ తో పిచ్చ ఆనందంలో ఉన్నాడు. మూడు ప్లాప్స్ తర్వాత వచ్చిన హిట్ సినిమాతో నితిన్ ఉత్సాహంగా మరో సినిమాని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే వెంకీల అట్లూరి తో రంగ్ దే సినిమా చేస్తున్న నితిన్ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వం లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధాదున్ రీమేక్ మొదలెట్టాడు. ప్రస్తుతం రెండు సినిమాల్తోనూ, పెళ్లి పనులతోను బిజీగా ఉన్న నితిన్ కి అల్లు అర్జున్ విష్ బూస్ట్ లాగా పనిచేస్తుంది. అల్లు అర్జున్ భీష్మ హిట్ ని పెళ్లి పనులతో కలిసి ఎంజాయ్ చెయ్యంటూ నితిన్ ని విష్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా భీష్మ సక్సెస్ అవడంతో నితిన్ కి విషెస్ తెలియజేస్తూ నితిన్ ని కలిసి అభినందించాడు.

ఇక నితిన్ ఈ రీమేక్ చేయడంపై మీడియాలో పలు రకాలు వార్తలొస్తున్నప్పటికీ.. నితిన్ ధైర్యంగా ఆ సినిమా ని లాంచ్ చేసాడు. అయితే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన అంధాదున్ సినిమా కథ మొత్తం ఆయుశ్మాన్ ఖురానా మరియు మరో కీలక పాత్ర టబు చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది. అంధుడైన ప్రొఫెషనల్ పియానో ప్లేయర్ లా ఆయుశ్మాన్ ఖురానా పాత్రలో ఒదిగిపోయి ఇరగదీసాడు. అలాగే అక్రమ సంబంధం నెరిపే క్రిమినల్ లేడీ పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు అద్భుతమైన నటనతో అదరగొట్టింది . మరి నితిన్ ఆయుష్మాన్ పాత్ర చేస్తుంటే ఇప్పుడు టబు పాత్రధారిపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. టబు పాత్రకి టబునే సెట్ అవుతుంది మరొకర్ని ఊహించలేము అంటున్నారు కొందరు. కాదు ఆ పాత్రకి మరో సీనియర్ నటి ని తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. మరి టబు కేరెక్టర్ చేసే లేడి గురించి అందరిలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

Tags:    

Similar News