హిందీ ఇస్మార్ట్ లో హీరో ఎవరో తెలుసా

బాహుబలి తరువాత మన తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. అప్పటివరకు మన తెలుగు సినిమాల వైపు అసలు చూడని బాలీవుడ్ వాళ్ళు గత కొంత కాలం నుంచి [more]

Update: 2019-10-05 09:00 GMT

బాహుబలి తరువాత మన తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. అప్పటివరకు మన తెలుగు సినిమాల వైపు అసలు చూడని బాలీవుడ్ వాళ్ళు గత కొంత కాలం నుంచి మన సౌత్ సినిమాలని తెగ కొంటున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలని భారీ రేట్స్ కి కొంటున్నారు. ఆ మధ్య డియ‌ర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ కంటే ముందే దాని హ‌క్కులు క‌ర‌ణ్ జోహార్ కొనేసిన సంగ‌తి తెలిసిందే. దీనికంటే ముందు నాని జెర్సీ, ఆరెక్స్ 100 సినిమాల హ‌క్కులూ కొన్నారు. రీమేక్ రైట్స్ అయితే కొంటున్నారు కానీ రీమేక్ చేయడం లేదు.

రణబీర్ కే ఛాన్స్…..

లేటెస్ట్ బాలీవుడ్ వాళ్ళు మరో సినిమా కొన్నారు. అదే పూరి – రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్. ఈ మూవీకి హిందీలో వినిపిస్తున్న హీరో పేరే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ర‌ణ‌బీర్ క‌పూర్ ఇస్మార్ట్ శంక‌ర్ రీమేక్‌లో న‌టిస్తాడ‌ట‌. మొదట రామ్ ని కూడా ఇంతే అనుకున్నారు. ఇప్పుడు రణబీర్ కపూర్ ని అనుకుంటున్నారు. అయితే హిందీ వర్షన్ కి డైరెక్టర్ ఎవరో ఇంకా క్లారిటీ లేదు. గత కొన్ని సినిమాల నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో అల్లాడిపోయిన రన్బీర్ కపూర్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిద్దాం. అసలు రణబీర్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తాడో లేదో…ఇందులో ఎంత నిజముందో తెలియాల్సిఉంది.

 

 

Tags:    

Similar News