థమన్ సుడి మాములుగా లేదు?

అలా వైకుంఠపురములో సినిమాతో థమన్ ఒక్కసారిగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లోకొచ్చేసాడు. దేవిశ్రీ మ్యూజిక్ డల్ అయిన క్షణాన థమన్ ఒక్కసారిగా [more]

Update: 2020-03-21 06:18 GMT

అలా వైకుంఠపురములో సినిమాతో థమన్ ఒక్కసారిగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లోకొచ్చేసాడు. దేవిశ్రీ మ్యూజిక్ డల్ అయిన క్షణాన థమన్ ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచాడు. అలా వైకుంఠపురములో సినిమా హిట్ లో మేజర్ పార్ట్ మ్యూజిక్ దే. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురములో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. అలాగే భీష్మ సాంగ్స్ కూడా బావున్నాయి. ఇక థమన్ వరస సినిమాల్తో బాగా బిజీ అయ్యాడు. ప్రస్తుతం సుకుమర్ – అల్లు అర్జున్ సినిమా విషయంలోనూ థమన్ పేరు నలుగుతుంది. దేవి స్థానంలో థమన్ నే బన్నీ సూచిస్తున్నాడట.

మరోపక్క త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ బిజీగా ఉండడంతో పాటుగా ఈ సినిమాకి కావాల్సిన హీరోయిన్, టెక్నీషియన్స్ లిస్ట్ తో పాటుగా నటీనటుల ఎంపిక చేపట్టాడట అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పేరే ఫైనల్ లిస్ట్ లో ఉందనే టాక్ వినబడుతుంది. అరవింద సమేత సాంగ్స్ అంతగా లేకపోయినా… అలా వైకుంఠానికిచ్చిన మ్యూజిక్ తో ఎన్టీఆర్ ఫిదా అవడంతో.. త్రివిక్రమ్ చెప్పిన మాట ఎన్టీఆర్ వెంటనే ఒప్పుకుని థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోమని చెప్పాడట. సో థమన్ వరస ప్రాజెక్ట్స్ లో ఇలా ఫుల్ బిజీ అన్నమాట.

Tags:    

Similar News