అబ్బ అందమంటే ఇదేనా

Update: 2018-06-03 06:55 GMT

బాలీవుడ్ లో అదితి రావు అంటే తెలియని వారుండరు. ఎందుకంటే అదితి కి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రాకపోయినప్పటికీ.. ఎప్పుడూ అవార్డు ఫంక్షన్స్, ప్రీమియర్ షోస్ కి, అలాగే పార్టీస్ కి అందమైన డ్రెస్సులు వేసుకుని ఎప్పుడూ హల్చల్ చేసే అదితి రావు ఈ మధ్యన సౌత్ సినిమాల్లో తెగ హల్చల్ చేస్తుంది. అమ్మాయిది హైదరాబాద్ అయినప్పటికీ.. ఎప్పుడో బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే మొన్నామధ్యన మణిరత్నం చెలియా సినిమాతో సౌత్ లో కాలు పెట్టిన అదితి కి ఆ సినిమా నిరుత్సాహ పరిచింది. కానీ అదితి బాలీవుడ్ లో నటించిన పద్మవత్ సినిమా హిట్ అయ్యింది. అందులో అదితి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే రణ్వీర్ సింగ్ కి భార్య గా నటించి అదరగొట్టింది.

తాజాగా అదితి రావు తెలుగులో సుధీర్ బాబు కి జోడిగా సమ్మోహనం సినిమాలోనటిస్తుంది. ఈ సినిమాలో అదితి చాలా అందంగా కనబడుతుంది. తాజాగా వచ్చిన సమ్మోహనం ట్రైలర్ లో అదితి రావు హైలెట్ గా వుంది. అయితే ఎప్పుడూ ట్రెడిషనల్ గా కనబడే అదితి రావు ఇప్పుడు ఒక లెవల్లో అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయ్యింది. ఎప్పుడూ అంత అందమైన గ్లామర్ అదితిని మనం చూసుండం. అయితే తాజాగా అదితి తాను గ్లామర్ పాత్రలకు సై అనే మెస్సేజ్ ని సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో పాటుగా పోస్ట్ చేసింది. అదితి రావు వైట్ బికినీ లో చేస్తున్న ఆ గ్లామర్ షో ఫోటో వైరల్ అయ్యింది.

ఎంతో హాట్ గా బికినీ అంటేనే హాట్ అనుకోండి.. అయినా అదితి మత్తెక్కించే చూపులతో... అలా బికినీ తో నుంచుంటే అందరూ.. అబ్బా ఎంత అందం.. ఇప్పటివరకు ఎక్కడుంది అంటూ లొట్టలేసుకుంటున్నారు. మరి నిజంగానే అదితి రావు ఆ తెల్లని బికినిలో పాలరాతి బొమ్మలా మెరిసిపోతూ... చూపరుల మతులు పోగొడుతుంది.మరి అదితి అందాలు చూసిన ఎవ్వరైనా అబ్బా అదితి అతిలా వచ్చేస్తుందిగా అంటున్నారు. మరి సౌత్ తో పాటు అమ్మడు బాలీవుడ్ మీద గట్టిగా కన్నేసినట్టుగానే కనబడుతుంది...ఈ ఫొటోలోని అదితి వాలకం చూస్తుంటే.. చూద్దాం ఈ గ్లామర్ షో అదితిని ఎక్కడికి తీసుకెళుతుందో అనేది.

Similar News