'సమ్మోహనం' లో అదితీరావు చింపేసింది

Update: 2018-06-16 04:38 GMT

మణిరత్నం 'చెలియా' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది బాలీవుడ్ హీరోయిన్ అదితీరావు. ఆ సినిమాలో ఆమె గ్లామర్ తోనే కాదు నటన పరంగా కూడా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత మళ్లీ అదితీరావు తెలుగులో డైరెక్ట్ గా చేసిన సినిమా 'సమ్మోహనం'.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈ రోజునే భారీస్థాయిలో విడుదలైంది. సినిమా చూసిన వాళ్లు 'సమీరా' పాత్రలో అదితీరావు అద్భుతంగా నటించిందని అంటున్నారు. స్టార్ హీరోయిన్ పాత్రలో ఆమె ఎంతో సహజమైన అభినయాన్ని కనబరిచిందని చెబుతున్నారు.

ఆమె పాత్ర తెరపై చూసినంత సేపు రియల్ లైఫ్ లో హీరోయిన్ జీవితం ఇలా ఉంటుందా అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ బాబుతో లవ్ సీన్స్ లో చాలా బాగా చేసిందని మెచ్చుకుంటున్నారు. సినిమా చూసినంత సేపు తెలుగు అమ్మాయిలా ఉందని... ఫ్యూచర్ లో ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ రావడం కాయం అని చెబుతున్నారు

Similar News