ఆ హీరో ఆశలన్నీ ఆ మూవీ పైనే

నటుడు సాయి కుమార్ కొడుకు ఆది ఇండస్ట్రీ కి వచ్చిన చాల ఏళ్ళు అయింది. వరస పరాజయాలతో తో కెరీర్ ని నాశనం చేసుకున్నట్టున్నాడు. ఆది మొదటి [more]

Update: 2019-09-08 04:27 GMT

నటుడు సాయి కుమార్ కొడుకు ఆది ఇండస్ట్రీ కి వచ్చిన చాల ఏళ్ళు అయింది. వరస పరాజయాలతో తో కెరీర్ ని నాశనం చేసుకున్నట్టున్నాడు. ఆది మొదటి చిత్రం ప్రేమకావాలి మంచి హిట్ అందుకుంది.ఆ తరువాత లేడీ డైరెక్టర్ బి. జయ తో చేసిన లవ్లీ చిత్రం కూడా మంచి హిట్ అందుకోవడంతో మనోడికి ఇంకా తిరుగు ఉండదు అనుకున్నారు అంతా. కానీ ఆ తరువాత తీసిన సినిమాలు అని డిజాస్టర్స్ అయ్యాయి. కనీసం యావరేజ్ గా కూడా ఆడలేదు.

పదమూడు సినిమాలు చేస్తే…

ఆది మొత్తం పదమూడు సినిమాలు చేస్తే అందులో రెండు మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు మనోడి కెరీర్ ఎలా ఉందొ అని. రీసెంట్ గా ఆది ‘జోడి’తో మరోసారి నిరుత్సాహ పరిచాడు. మొదటి షో నుండే ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చేసింది. చాలా రెగ్యులర్ కథ అని బాడ్ టాక్ వచ్చేయడంతో ఈ సినిమాను చూడటానికి ఎవరు ముందుకు రావడంలేదు. ఇప్పుడు ఆది ఆశలన్నీ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమా మీదే. ‘వినాయకుడు’ ఫేం సాయి కుమార్ అడివి తెరకెక్కించిన ఈ సినిమాతో అయినా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు ఆది. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాత్రం ఇంకా క్లారిటీ లేదు మేకర్స్ నుంచి. సినిమా అయితే అవ్వడానికి ఎప్పుడో అయిపోయింది.

Tags:    

Similar News