రామాయణానికి.. ఆదిపురుష్ కి సంబంధమే లేదా?

ప్రభాస్ రాధేశ్యాం తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిపురుష్ తో సినిమాని పట్టాలెక్కించేందుకు తహతహలాడుతున్నాడు. అయితే ఓం రనౌత్ ఆదిపురుష్ సినిమాని ప్రకటించినప్పటినుండి.. [more]

Update: 2020-09-25 07:12 GMT

ప్రభాస్ రాధేశ్యాం తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిపురుష్ తో సినిమాని పట్టాలెక్కించేందుకు తహతహలాడుతున్నాడు. అయితే ఓం రనౌత్ ఆదిపురుష్ సినిమాని ప్రకటించినప్పటినుండి.. ఈ సినిమా రామాయణానికి ఆధారముగా తెరకెక్కుతోందని… ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడనే టాక్ మొదలయ్యింది. దానికి ఆధారంగానే రాముడి భార్య సీత పాత్ర కి హీరోయిన్స్, రావణ్ పాత్రకి సైఫ్ అలీఖాన్, లక్షణుడి పాత్రకి సౌత్ హీరో అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాముడిగా ప్రభాస్ బాడీ షేప్, ఆయన ఆహార్యం అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని.. ఓం రనౌత్ రామాయణాన్ని ఆదిపురుష్ గా మలచబోతున్నాడనే ఊహాగానాలు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

అయితే రామాయణంలోని రాముడి పాత్ర, సీత, లక్ష్మణుడి, హనుమంతుని పాత్రలను ఆదిపురుష్ పాత్రలు పోలి ఉంటాయని.. కానీ రామాయణాన్ని ఓం రనౌత్ చూపించడం లేదని, అసలు రామాయణంలో ఉన్న యుద్ధ, అడవి ఘట్టలాంటివి ఏమి ఆదిపురుష్ లో చూపించడం లేదని.. పురాణంలోని పాత్రలని ఆదిపురుష్ కి ఆపాదించారు తప్ప ఆదిపురుష్ కి రామాయణం కథకి సంబంధం లేదని తెలుస్తుంది. ఓం రనౌత్ ఆదిపురుష్ ని నేటి సమాజంలో జరిగే కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడని బి టౌన్ టాక్. మరి ప్రభాస్ రాముడి అవతారంలో ఊహించుకున్న వాళ్ళకి ఈ న్యూస్ కాస్త చేదు వార్తే అయినా.. రాముడి గుణగణాలతోనే ప్రభాస్ ఆదిపురుష్ పాత్ర డిజైన్ చెయ్యడం జరిగింది అని తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఆదిపురుష్ రామాయణం కథకి సంబంధం లేదనేది పక్కా అంటున్నారు.

Tags:    

Similar News