ఫ్లాప్ ల విషయంలో ఆది విశ్లేషణ

సాయి కుమార్ కొడుకు ఆది టాలీవుడ్ ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆది కమర్షియల్ గా ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. రీసెంట్ [more]

Update: 2019-10-21 08:23 GMT

సాయి కుమార్ కొడుకు ఆది టాలీవుడ్ ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆది కమర్షియల్ గా ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. రీసెంట్ గా చేసిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కి మిక్స్డ్ టాక్ రావడంతో ఇది కూడా ప్లాప్ కిందే పరిగణిస్తున్నారు ట్రేడ్ నిపుణులు. ఉండటానికి రెండుమూడు హిట్స్ ఉన్నాయి కానీ అవి ఏవి ఆది కెరీర్ పై ప్రభావం చూపలేదు.

కథలోనే మలుపు…

అసలు ఆది కి ఎక్కువ ఫ్లాప్ లు ఉండటానికి గల కారణాలు ఏంటో విశ్లేషించుకున్నాడట. ఆది ఎక్కువగా తన సినిమాల్లో కమర్షియాలిటీ ఉండే విధంగా చూసుకుంటాడు. ఎటువంటి కథ అయినా కమర్షియల్ గా ఉండేలా… ఎంటర్ టైన్ మెంట్ స్క్రీన్ ప్లేతో చేస్తున్నాడట. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథలను ఎంపిక చేసుకున్నప్పుడు ఎంటర్ టైన్ మెంట్ తో కాకుండా సీరియస్ గా స్క్రీన్ ప్లేను నడిపించినట్లయితేనే సినిమాకు మంచి టాక్ వచ్చి తనకు కొంత ప్లస్ అవుతుందని భావించేవాడు. ఇక నుంచి మంచి కథను నమ్ముకుని సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మరి ఆది ఇకపై ఎటువంటి సినిమాలు, ఎటువంటి కథలు ఎంచుకుంటాడో చూడాలి.

 

 

Tags:    

Similar News