అబ్బో అందం కళ్లలో దాగుంటుంధా

Update: 2018-07-01 07:50 GMT

చెలియా సినిమా తో సౌత్ లో అడుగుపెట్టిన అదితి రావు.... ఈ ఏడాది మొదట్లో విడుదలైన పద్మవత్ చిత్రంతో బాగా ఫెమస్ అయ్యింది. పద్మావతీ చిత్రం లో అల్లావుద్దీన్ ఖిల్జీ కి బేగం గా నటించిన అదితి కి పద్మవత్ చిత్రం మంచి పేరు తెచ్చింది. ఇక మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన చెలియా సినిమా ప్లాప్ అయినప్పటికీ... తెలుగులో ఇంద్రగంటి మోహన కృష్ణ - సుధీర్ బాబు కాంబోలో తెరకెక్కిన సమ్మోహనం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా రెండు వరాల క్రితమే విడుదలై డీసెంట్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో అదితి నటనకు, అందానికి మంచి మార్కులు పడడమే కాదు... అమ్మడుకి సౌత్ లో అవకాశాలు పెరగడానికి ఈ సమ్మోహనం దోహదపడేలా కనబడుతుంది కూడా.

ఇక చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన అదితి వారడిగిన అనేక రకాల ప్రశ్నలకు తెలివిగా... అలోచించి మరి సమాధానాలు చెప్పింది.

1. సమ్మోహనం అంత పెద్ద హిట్ అయ్యింది కదా... ఈ విజయం మీకెలా అనిపించింది?

చాల థ్రిల్ అయ్యానని.. అలాగే ఎంతో ఇష్టపడి ఈ సినిమాలో తానూ నటించానని చెప్పింది.

2. మీరంతా అందంగా.. క్యూట్ గా ఎందుకు ఉన్నారు?

నేనంత అందంగా పుట్టడం అనేది నా తల్లి తండ్రుల తప్పు అంటూ నవ్వేసింది.

3. మీకు ఏయే భాషలు అవచ్చు?

ఇంగ్లిషు, హిందీ భాషలు వచ్చని తెలుగు, తమిళం కాస్త వచ్చని చెప్పింది.

4. ఇంకా మీరు క్రేజీగా చేసే పనేమిటి?

ఎవ్వరు చూడకుండా డాన్స్ చెయ్యడం అంటూ చిలిపిగా సమాధానం చెప్పింది.

5. మీకిష్టమైన తెలుగు సినిమాలేవీ?

హలో, పెళ్లి చూపులు, ఫిదా

6. మీ హాబీలేమిటి?

పాటలు పాడటం, నటించడం, డ్యాన్స్‌ చేయడం

7. మీ అందానికి రహస్యం?

మన అందామనేది కళ్ళలో దాగుంటుందంటూ అందమైన నవ్వుతో సమాధానాలిచ్చింది అదితి.

Similar News