జబర్దస్త్ కి చెక్ పెడుతున్న అదిరింది!!

నాగబాబు జబర్డ్స్ నుండి వెళ్ళిపోయాక జీ ఛానల్ లో అదిరింది షో మొదలు పెట్టించాడు. కర్త కర్మ క్రియ అన్ని అదిరింది కి నాగబాబు అనేలా ప్రచారం [more]

Update: 2020-08-01 07:36 GMT

నాగబాబు జబర్డ్స్ నుండి వెళ్ళిపోయాక జీ ఛానల్ లో అదిరింది షో మొదలు పెట్టించాడు. కర్త కర్మ క్రియ అన్ని అదిరింది కి నాగబాబు అనేలా ప్రచారం జరిగింది. జబర్దస్త్ కి చుక్కలు చూపించడం ఖాయమానుకుని జబర్దస్త్ ని ఎత్తిపోశాడు నాగబాబు కానీ అదిరింది  షోకి అనుకున్న టీఆర్పీలు రాలేదు. జబర్దస్త్ ముందు ప్రతి వారం అదిరింది షో వెలవెల బోతోనే ఉంది. అయితే తాజాగా అంటే కరోనా లాక్ డౌన్ ముగిసాక అదిరింది షో రేటింగ్స్ ఆశాజనకంగా ఉన్నాప్పటికీ.. జబర్దస్త్ ని దాటలేకపోయాయని అంటున్నారు. కానీ తాజాగా జబర్డ్స్ ని క్రాస్ చేసేందుకు ఆదీరింది రెడీగా ఉందని అంటున్నారు. కారణం జబర్దస్త్ స్కిట్స్ లో కామెడీ తగ్గడమేనట.

లాక్ డౌన్ తర్వాత జబర్డ్స్ లో చాలా మర్పులు చేసారు. చాల టీం లీడర్స్ ని తీసేసి.. తాగుబోతు రమేష్‌, షకలక శంకర్ టీమ్స్ తీసుకొచ్చాయి. లాక్ డౌన్ తర్వాత కేజబర్దస్త్ కామెడీలో పస తగ్గింది అనే టాక్ వినబడుతుంది.  గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్‌లో హైపర్ ఆది, శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ స్కిట్స్ తప్ప మిగతా స్కిట్స్ పెద్దగా ఆకట్టుకోవడం లేదని సోషల్ మీడియా టాక్. గురువారం ఆది, శుక్రవారం సుధీర్ స్కిట్స్ మినహా మిగిలిన టీమ్‌లకు యూట్యూబ్‌లో పెద్దగా వ్యూస్ రావడం లేదని చెబుతున్నారు. అదే టైం లో చమ్మక్ చంద్ర వాళ్ళ  అదిరింది షో దూసుకుపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత అదిరింది షో చిన్న మార్పులు తప్ప మేజర్ర్ మార్పులేమీ చెయ్యలేదు. అదిరింది షో లో  సద్దాం టీమ్ గల్లీ బాయ్స్, హరి టీమ్ రౌడీ బాయ్స్  అదరగోటేటిస్తున్నాయి. యూట్యూబ్ లోను వీరి స్కిట్స్ కి మంచి వ్యూస్ రావడంతో.. జబర్డ్స్ కి త్వరలోనే అదిరింది చెక్ పెట్టినా పెట్టొచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News