పెద్ద గుణపాఠమే నేర్చుకున్నా

Update: 2018-09-17 11:58 GMT

తెలుగులో ‘క్షణం’.. ‘గూఢచారి’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలని అందించిన అడివి శేష్ ఆ సినిమాలను డైరెక్ట్ చేయకపోయినా అతనికే ఎక్కువ పేరు వచ్చింది. ఆ రెండు సినిమాలకి స్టోరీ ఇవ్వడంతో పాటు స్క్రీన్ ప్లే లో కూడా భాగస్వామిగా ఉండటంతో అతనికే ఎక్కువ క్రెడిట్ వచ్చింది. అంతే కాదు మేకింగ్ విషయంలో కూడా తాను ఇన్వాల్వ్ కావడంతో ఆ డైరెక్టర్స్ పేరు కన్నా ఇతని పేరు ఎక్కువ బయటికి వచ్చింది.

మరి ఇంత చేస్తున్న శేష్..మీరు ఎందుకు డైరెక్ట్ చేయకూడదు.. మీ సినిమాలని మీరే డైరెక్ట్ చేయొచ్చుగా అని అడిగితే.. ఇంతకముందు ఆలా చేసే చాలా దెబ్బ తిన్నానని చెప్పుకొచ్చాడు. గతంలో శేష్ ‘కర్మ’.. ‘కిస్’ అనే సినిమాలు తీయడమే కాదు తానే స్వయంగా అందులో నటించాడు. అయితే ఆ రెండు సినిమా డిజాస్టర్ గా నిలవడంతో తనకు పెద్ద గుణపాఠమే నేర్పాయని శేష్ చెప్పాడు.

ఇక తను నటించే సినిమాలను తాను డైరెక్ట్ చేయనని.. డైరెక్ట్ చేస్తే నటించను అని క్లారిటీ ఇచ్చాడు. దర్శకత్వం మెదడుతో చేయాలని..నటన మనసుతో చేయాలని అంతే కానీ రెండు కలిపి చేయడం కష్టం అని అందుకే నేను ఇంకా ఆలా చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు శేష్. నా ఫస్ట్ ఇంపార్టెన్స్ నటనకే అని..సినిమాల్లో కి వచ్చిన తర్వాత డైరెక్షన్ స్టార్ట్ చేసానని..ఇక ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాడు. ప్రస్తుతం తాను ‘2 స్టేట్స్’ రీమేక్‌లో నటిస్తున్నానని.. నెక్స్ట్ మూవీ ఇంకా కంఫర్మ్ చేయలేదని.. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు శేష్.

Similar News