11 రోజులకే బ్రేక్ ఈవెన్

అడవి శేష్ ఎవరు సినిమాకి హిట్ టాక్ పడింది కానీ.. సినిమాకి బ్రేక్ ఈవెన్ రావడానికి 11 రోజుల సమయం పట్టింది. ఎవరు సినిమాకొచ్చిన టాక్ తో [more]

Update: 2019-08-26 13:27 GMT

అడవి శేష్ ఎవరు సినిమాకి హిట్ టాక్ పడింది కానీ.. సినిమాకి బ్రేక్ ఈవెన్ రావడానికి 11 రోజుల సమయం పట్టింది. ఎవరు సినిమాకొచ్చిన టాక్ తో ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనుకున్నారు అంతా. కానీ సినిమా కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి కనెక్ట్ కావడం, బిసి సెంటర్స్ ఆడియన్స్ దూరంకావడంతో ఎవరు సినిమాకి ఓ… అన్నంత కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇక ఎవరు సినిమాతో నిర్మాతలు భారీగా లాభపడతారు అనుకుంటే… చిన్నపాటి లాభాలు తప్ప పెద్దగా లాభాలు రావని తేలిపోయింది. ఇక రేపు శుక్రవారం వరకే ఎవరు కలెక్షన్స్ ని కౌంట్ చేసేది. తర్వాత సాహో ప్రభంజనం తో ఎవరు కాదు ఏ సినిమా కూడా థియేటర్స్ లోకి నిలవదు, నిలవలేదు. మరి ఎవరు సినిమా 11 డేస్ కలెక్షన్స్ మీ కోసం…

ఏరియా 11 డేస్ కలెక్షన్స్(కోట్లలో)

నైజాం 3.40
సీడెడ్ 0.80
అర్బన్ ఏరియాస్ 1.05
గుంటూరు 0.51
ఈస్ట్ గోదావరి 0.52
కృష్ణ 0.62
పశ్చిమ గోదావరి 0.33
నెల్లూరు 0.19
ఏపీ అండ్ టీఎస్ 7.40
ఇతర ప్రాంతాలు 0.70
ఓవర్సీస్ 1.60
వరల్డ్ వైడ్ షేర్స్ 9.70

Tags:    

Similar News