ఆ పాత్రకు టబు ఒప్పుకుంటుందా..?

బాలీవుడ్ లో సీనియర్ నటి, హాట్ హీరోయిన్ అయిన టబు ఇప్పటికీ పెళ్లి గిల్లి లేకుండా సింగిల్ గానే ఉంది. ఈ వయసులోనూ మంచి గ్లామర్ మెయింటైన్ [more]

Update: 2019-03-22 06:29 GMT

బాలీవుడ్ లో సీనియర్ నటి, హాట్ హీరోయిన్ అయిన టబు ఇప్పటికీ పెళ్లి గిల్లి లేకుండా సింగిల్ గానే ఉంది. ఈ వయసులోనూ మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తూ హాట్ గానే కనబడుతుంది. మరి 50 ఏళ్లు దాటాక కూడా హీరోయిన్ ఛాన్సెస్ అంటే కాస్త కష్టమే. అందుకే బాలీవుడ్ మూవీస్ లో ఏ పోలీస్ అధికారిణి గానో.. లేదంటే ఏదో కీ రోల్స్ చేస్తూనో కనబడుతుంది. తెలుగులో అయితే నాగార్జున,వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించిన టబు తర్వాత బాలయ్య, చిరు పక్కన భార్య పాత్రల్లో నటించింది. అలాగే బాలయ్యకి చెన్నకేశవరెడ్డి సినిమాలో తల్లిగా, అందరివాడు సినిమాలో చిరుకి భార్యగా, తల్లిగా అదరగొట్టేసింది.

తల్లి పాత్ర చేస్తుందా..?

ఆలాంటి సీనియర్ హీరోయిన్ ని త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం దింపుతున్నాడనే టాక్ వినబడుతుంది. నిన్నమొన్నటి వరకు నగ్మా పేరు వినబడిన అల్లు అర్జున్ తల్లి పాత్రకి ఇప్పుడు టబు పేరు ఇప్పుడు వినబడుతుంది. అయితే కొంతమంది ఇప్పటికీ హాట్ గ్లామర్ పాత్రల్లో మెరుస్తున్న టబు అల్లు అర్జున్ తల్లి పాత్రకి సై అంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ గతంలోనే టబు బాలయ్యకి, చిరుకి తల్లి పాత్రల్లోనటించిన విషయం మరిచిపోతున్నారు. ఇకపోతే త్వరలోనే మొదలు కాబోతున్న అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రకి టబు పేరు పరిశీలనలో ఉండగా నేను నాన్నా అనే టైటిల్ వాడుకలో ఉంది కాబట్టి.. అల్లు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారో అనే క్యూరియాసిటీ ఇప్పుడు ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక అల్లు అర్జున్ కి జోడిగా పూజా హెగ్డే, కేథరిన్ హీరోయిన్స్ గా నటించబోతున్నారని, రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడే త్రివిక్రమ్ తో తన కొత్త సినిమాని అల్లు అర్జున్ మొదలు పెట్టబోతున్నాడని సమాచారం.

Tags:    

Similar News