ఆమెకి ఆ డైరెక్టర్ అంటే ఎందుకంత కోపం

Update: 2018-05-25 10:04 GMT

ఈ మధ్యన సినిమాల్లో ఎక్కువగా కనబడకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చ‌ల్ చేస్తోంది నటి పూనమ్ కౌర్. సినిమాల్లో అవకాశాలు రాక గ్లామర్ డోస్ పెంచినా పని జరక్క పోవడంతో.. పూనమ్ ఇప్పుడు తనకి అవకాశాలివ్వని కొందరిని టార్గెట్ చేస్తుంది. మొన్నామధ్యన పవన్ కళ్యాణ్ మీద ఇండైరెక్ట్ ట్వీట్స్ వేస్తూ అల్లాడించిన పూనమ్ కౌర్ ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ ని టార్గెట్ చేసింది. త్రివిక్రమ్ ని మైండ్ లో పెట్టుకుని ట్వీట్ల‌ వర్షం కురిపిస్తుంది. అసలింతకీ పూనమ్ చేసిన ట్వీట్ ఏమిటంటే.. జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు. జాగ్రత్త నమ్మకద్రోహి.. అంటూ చేసిన‌ హాట్ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చర్చనీయాంశమైంది.

ఆమె టార్గెట్ త్రివిక్ర‌మేనా..?

మరి ఈ ట్వీట్ చూస్తుంటే త్రివిక్రమ్ నే అన్నట్టుగా వుంది. అది ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. మరి పూనమ్ చేసిన ఆ ట్వీట్ లో జల్సా, అజ్ఞాతవాసి సినిమాలు చేసింది త్రివిక్రమ్ కదా. మరి ఆ సినిమాల్లో నటించింది పవన్ కళ్యాణ్ అయినప్పటికీ.. ఈ ట్వీట్ పవన్ ని కాదని త్రివిక్రమ్ మీదే చేసినట్టుగా అనిపిస్తుంది. మరి కత్తి మహేష్ ఆ మధ్యన ఛానల్స్ లో కూర్చుని పూనమ్ కౌర్ ఒక డైరెక్టర్, పవన్ కళ్యాణ్ వల్ల‌ ఆత్మహత్య యత్నం చేసిందని.. ఆమెకి హాస్పిటల్ బిల్ కూడా పవన్ కల్యాణే కట్టాడని కూడా అన్నాడు. మరి అప్పట్లో ఆ వార్తలు ఎంత సంచలనమ‌య్యాయో.. ఇప్పుడు పూనమ్ చేసిన ట్వీట్స్ కూడా మరింత వేడెక్కిస్తున్నాయి.

గ‌తంలోనూ హాట్ ట్వీట్స్‌

ఇక ఈ హాట్ ట్వీట్ కన్నా ముందుగా పూనమ్ కౌర్ ఇండస్ట్రీలోని ఒక టాప్ దర్శకుడు నాలుగు కుటుంబాల ప్రాపకం కోసం పాకులాడుతూ ఉంటాడని , ఒక హీరోయిన్ కోసం చాలా చేసాడని, నాకు హిట్ లేదు కాబట్టి తనను పట్టించుకున్నాడా? అంటూ పూనమ్ ఆవేశంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మరి పూనమ్‌ కౌర్ ఈ హాట్ హాట్ ట్వీట్స్ తో ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్ గా నిలిచింది. మొత్తానికి సినిమాల్లేకపోయిన ఇలాంటి హాట్ న్యూస్ లతో పూనమ్ తన ఉనికిని చాటుకుంటుంది.

Similar News