త్రివిక్రమ్ పై హేమ ఫైర్..!

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక డైరెక్టర్ పై ఫైర్ అయ్యింది. మీరు ఇండస్ట్రీకి [more]

Update: 2019-01-31 06:14 GMT

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక డైరెక్టర్ పై ఫైర్ అయ్యింది. మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. త్రివిక్రమ్ గారి సినిమాల్లో చాలాసార్లు కనిపించారు కానీ ఈ మధ్య ఎందుకు కనిపించడం లేదు అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ‘‘నా రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి అతనెవరు? అయితే నేను డిసైడ్ చేయాలి లేదా మేనేజర్ డిసైడ్ చేయాలి’’ అని త్రివిక్రమ్ పై ఫైర్ అయ్యింది. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయానని వెల్లడించింది.

అటువంటివేం జరగలేదు…

అలానే ‘మీటూ’ వంటివి మీరు ఏమైనా ఎదురుకున్నారా? అని అడిగితే…నా దగ్గరకు వచ్చే దైర్యం ఎవరికి ఉంది చెప్పండి? అలాంటివి నాకు ఎప్పుడూ జరగలేదు అని క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా ఆమె బోయపాటి డైరెక్షన్ విన‌య విధేయ రామ చిత్రంలో మెరిసింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి మా అసోసియేష‌న్‌లో మెంబ‌ర్‌గా ముఖ్య భూమిక పోషిస్తుంది.

Tags:    

Similar News