ప్రభాస్ అంటే అంతే మరి..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందరు హీరోలు కన్నా ప్రభాస్ లో ఓ ప్రత్యేకత ఉంటుంది. అందరిలా [more]

Update: 2019-04-18 09:57 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందరు హీరోలు కన్నా ప్రభాస్ లో ఓ ప్రత్యేకత ఉంటుంది. అందరిలా ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండదు. అందరిలా పోస్ట్ లు పెట్టడం, ఫొటోస్ షేర్ చేయడం ఉండదు. కానీ అతనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ప్రభాస్ కు ఇప్పటివరకు ఫేస్ బుక్ అకౌంట్ తప్ప ఏ సోషల్ మీడియా అకౌంట్ లేదు. ట్విట్టర్ కూడా లేదు. కానీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం రీసెంట్ గా ఖాతా తెరిచాడు. అలా ఓపెన్ చేయగానే ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా 7 లక్షల ఫాలోయర్లు వచ్చారు.

బాహుబలి పోజు పెట్టడంతో

ఇక నిన్న ‘బాహుబలి 2’ సినిమా నుండి అమరేంద్ర బాహుబలి గెటప్ లో ఉన్న ఒక స్టిల్ పోస్ట్ చేశాడు. లాంగ్ హెయిర్ తో రెండు కత్తులను చేతబట్టిన పవర్ఫుల్ పోజు అది. ఈ ఫోటో పెట్టిన గంట లోపే 82 వేల లైక్స్ వచ్చాయి. వెల్కం అన్నా.. వెల్కమ్ డార్లింగ్.. సాహో టైమ్ స్టార్ట్స్ నౌ… రికార్డ్ బ్రేకర్ వచ్చాడని మెసేజుల మీద మెసేజులు పెట్టారు. మరి ఇన్ స్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉండడం కోసమే ఫోటో షేర్ చేసాడని ఎవరికీ తెలియదు. అతను యాక్టీవ్ గా ఉన్నా లేకపోయినా అతను డార్లింగే.

Tags:    

Similar News