ఆచార్య టెంపుల్ సెట్ లో దాగిన రహస్యాలు

చిరంజీవి – రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ ప్రస్తుతం కరోనా వలన ఆగిపోయింది. చిరు కరోనా ఉధృతి తగ్గాక ఆచార్య [more]

Update: 2021-04-26 11:50 GMT

చిరంజీవి – రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ ప్రస్తుతం కరోనా వలన ఆగిపోయింది. చిరు కరోనా ఉధృతి తగ్గాక ఆచార్య షూటింగ్ చేద్దామని కొరటాలకి చెప్పడంతో కొరటాల శివ కూడా ఆచార్య షూటింగ్ కి బ్రేకులిచ్చారు. ఇక ఇప్పుడు ఆచార్య టెంపుల్ సెట్ కి 20 కోట్ల బడ్జెట్ పెట్టారనే టాక్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే ఆ టెంపుల్ సెట్ కి అంత భారీ ఖర్చు పెట్టడానికి చాలా లెక్కలే ఉన్నాయట. అంటే ఆ సెట్ లోనే సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ చిత్రీకరణ ఉంటుందట. ధర్మస్థలి కోసం 20 ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు.  
ఆచార్య సినిమాలోని 60 శాతం షూటింగ్ ఆ ధర్మస్థలి సెట్ లో చేస్తున్నారు. రామ్ చరణ్ – చిరంజీవి కాంబో సీన్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, రెండు మూడు సాంగ్స్ చిత్రీకరణ కూడా అదే సెట్ లో ఉండబోతుందట. అందుకే ఆ సెట్ కోసం ప్రత్యేకించి అంతగా ఖర్చు పెట్టింది. గతంలో అర్జున్ సినిమా కోసం మీనాక్షి టెంపుల్ సెట్ వేశారు. అదే టెంపుల్ లో చాలా సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు ఆ సెట్ కి అయిన ఖర్చు కూడా అంటే సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు ఆచార్య ధర్మస్థలి సెట్ కూడా 20 కోట్లు భారీ ఖర్చుతో అంతే పాపులర్ అయ్యింది.

Tags:    

Similar News