ఆచార్య కొరటాలపై మీమ్స్

రామ్ చరణ్ సిద్ధగా ఆచార్య మూవీలో తన కేరెక్టర్ కి సంబందించిన సన్నివేశాలను  పూర్తి చేసుకుని నిన్ననే ఆచార్య షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసాడు. అయితే కొరటాల [more]

Update: 2021-03-06 10:24 GMT

రామ్ చరణ్ సిద్ధగా ఆచార్య మూవీలో తన కేరెక్టర్ కి సంబందించిన సన్నివేశాలను  పూర్తి చేసుకుని నిన్ననే ఆచార్య షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసాడు. అయితే కొరటాల శివ ఎంతో ఉత్సాహం గా ఆచార్య అప్ డేట్స్ ఇద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక గందర గోళం జరుగుతుంది. అంటే ఆచార్య టైటిల్ విషయంలో చిరంజీవి గారు ఏదో ఈవెంట్ కి అతిధిగా వెళ్లి అక్కడ ఆచార్య టైటిల్ ని రివీల్ చేసి కొరటాలకు షాకిచ్చారు. గ్రాండ్ గా టైటిల్ ఇద్దామనుకుంటే చిరు అట్లా చేసారు. టీజర్ విషయంలోనూ చిరు కొరటాలని ఏడిపించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ సిద్ధగా ఆచార్య సెట్ లోకి అడుగుపెట్టిన విషయం ప్రకటనతో తెలియజేసారు.

భార్య ఉపాసనతో కలిసి సిద్ధగా ఆచార్య కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్ సైలెంట్ గా వెళ్లిపోకుండా ఆచార్య 20 డేస్ షూటింగ్ కంప్లీట్ అంటూ హంగామా చేస్తూ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఆచార్య షూటింగ్ షెడ్యూల్ రామ్ చరణ్ ముగించేసాడనే విషయం అందరికి తెలిసిపోయింది. మరి కొరటాల ఏదో ఒక విధంగా ఆచార్య అప్ డేట్ ఇద్దామనే అనుకుని ఉంటాడు. కానీ రామ్ చరణ్ ఇలా అందరికి తెలిసేలా చేసేసరికి రామ్ చరణ్ పై కొరటాల గుర్రుగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి. కొరటాల: ఏదో క్రేజీగా అప్ డేట్ ఇద్దామనుకున్నా.. కానీ రామ్ చరణ్ ఇలా పబ్లిక్ గా విషయం చెప్పేసాడు. ఇంకేం చేస్తాం అంటూ కొరటాల తలపట్టుకున్నట్టుగా మీమ్స్ సోషల్  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మీమ్స్ చూసి నెటిజెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Tags:    

Similar News