చిరును కంగారు పెడుతున్నదిదే

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ సినిమా సైరా చిత్ర షూటింగ్ ఈమధ్యే కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కి సిద్ధం [more]

Update: 2019-07-26 08:55 GMT

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ సినిమా సైరా చిత్ర షూటింగ్ ఈమధ్యే కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కి సిద్ధం అయింది. అయితే ఇక్కడ చిరుతో పాటు ఫ్యాన్స్ ని కంగారు పెట్టే అంశం ఏంటంటే ఈ సినిమా రన్ టైం. తాజా సమాచారం ప్రకారం ఈమూవీ రన్ టైం 3 గంటల 30 నిముషాలు వచ్చిందట.

ఆ 30 నిమిషాలు గురించే….

అయితే చిరు 3 గంటలు సినిమాకి అంత కంగారు పడడంలేదట. ఎందుకంటే రంగస్థలం మూడు గంటలు ఉంది కాబట్టి. కాకపోతే మిగిలిన 30 నిముషాలు గురించి టెన్షన్ పడుతున్నాడట. 3 గంటలు ప్రేక్షకులని కూర్చోబెట్టం అంటే మాములు విషయం కాదు. ఎక్కడ లాగ్ వచ్చినా బోర్ గా ఫీల్ అవుతారు. అలా అనిపిస్తే సినిమా పై ఎఫెక్ట్ పడుతుంది. పైగా ఇప్పుడు 3 గంటల 30 నిముషాలు అంటే సాధ్యం కాని పని. అందుకే చిరు గత రెండు రోజులు నుండి ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చుని అవసరం లేని సీన్స్ అన్ని తీసేస్తున్నాడట.

ఖర్చు చేసిన విజువల్స్ …..

భారీగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు పెట్టినవిని కూడా ఏమి ఆలోచించకుండా తీసేస్తున్నాడట. ఇలా చేయడం వల్ల సినిమా రన్ టైం కొంచం అయినా తగ్గించొచ్చని చిరు ఆలోచన. ఓవరాల్ గా ఈసినిమా రన్ టైం మూడు గంటలు లోపే తీసుకుని రావాలని చిరు ట్రై చేస్తున్నారు. ఇక ఈమూవీ అక్టోబర్ 2 న రిలీజ్ కానుంది.

Similar News