ఇండియన్ 2 సెట్స్ లో ఘోరం

భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా శంకర్.. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో భారీ హంగులతో రూపొందుతున్న ఇండియన్ 2 [more]

Update: 2020-02-20 03:45 GMT

భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా శంకర్.. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో భారీ హంగులతో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారతీయుడు గెటప్ లో కమల్ హాసన్ అద్భుతంగా కనిపిస్తుండగా… కాజల్, రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇండియన్ 2 సెట్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, దర్శకుడు శంకర్ గాయపడడంతో పాటుగా మరో పదిమంది కి తీవ్రగాయాలైనట్టుగా తెలుస్తుంది.

చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ లో సినిమా షూటింగ్ చిత్రీకరణజరుగుతుంది. అయితే ఆ ప్రదేశంలో ఒక పెద్ద క్రేన్ ఒక్కసారిగా కిందపడటంతో ముగ్గురు వ్యక్తుల అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ మధు, చంద్రన్ మరో టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడు శంకర్ కి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మృతదేహాలను చెన్నై లోని రాజీవ్ గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో హీరో కమల్ హాసన్ కి గాయాలు అవలేదని, దర్శకుడు శంకర్ కి కూడా చిన్న చిన్న దెబ్బలే తగిలాయని చెబుతున్నారు.. ఈప్రమాదంతో అక్కడున్న వారంతా షాక్ కి గురైనట్లుగా ప్రత్యక్ష సాక్షుల కథనం.

Tags:    

Similar News