భరత్ విజయానికి అడ్డం పడుతున్నాయా?

Update: 2018-04-20 04:33 GMT

మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను' భారీగా థియేటర్స్ లోకి అడుగుపెట్టేసింది. సినిమా మీద భారీ నుంచి అతి భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు - కొరటాల క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై అటు ఫాన్స్ లోను ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. మరి ఇలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన 'భరత్ అనే నేను' విజయానికి రెండు శక్తులు అడ్డంకులుగా మారాయి. సినిమా ప్రీమియర్ టాక్ పాజిటివ్ గానే ఉంది కానీ... ప్రస్తుతం ఛానల్స్ లో ఎక్కడా మహేష్ బాబు 'భరత్ అనే నేను' హంగామా కనబడడం లేదు. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సినిమా విడుదలవుతుంది అంటే చాలు పలు ఛానల్స్ వారు ఆ సినిమాపై విడుదలయిన థియేటర్స్ దగ్గర హంగామా చేస్తూ అభిమానవులను ఇంటర్వ్యూ లు చేస్తూ ఆ సినిమా పై అందరిలో ఆసక్తి కలిగేలా చేసేవారు. కానీ ప్రస్తుతం అన్ని ఛానల్స్ లో మహేష్ 'భరత్ అనే నేను' హంగామాని పక్కన పెట్టేసి ఏపీ ముఖ్యమంత్రి చందరబాబు బాయుడు గారు తన పుట్టినరోజు అయిన ఈ రోజు చేస్తున్న 'ధర్మ పోరాట దీక్ష' పై ఫోకస్ పెట్టాయి.

చంద్రబాబుకి అందరూ పుట్టిన రోజు గ్రీటింగ్స్ తెలుపుతూ ఆయన దీక్ష శిబిరానికి చేరుకుంటుంన్నారు. అలాగే ఆయన ధర్మ పోరాట దీక్ష కి పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. మరి ఏకధాటిగా బాబు దీక్షనే హైలెట్ చేస్తూ ఛానల్స్ మహేష్ 'భరత్ అనే నేను' ని లైట్ తీసుకున్నాయి. ఇక నిన్నా, మొన్న శ్రీ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ ల విషయాలతో టివి ఛానల్స్ అన్ని బాగా బిజీగా వున్నాయి. గత రెండు రోజుల నుండి 'భరత్ అనే నేను' ప్రమోషన్స్ ఎంత పీక్స్ కి తీసుకెళ్లినా ఛానల్స్, వెబ్ మీడియా మొత్తం శ్రీ రెడ్డి, వర్మ ల మీద ఫోకస్ చేసి భరత్ ని పక్కన పెట్టేశాయి. కొని ఛానల్స్ లో అయితే 'భరత్ అనే నేను' యాడ్ కింద బాక్స్ లో ఉంటె... పైన మాత్రం బాబు 'ధర్మ పోరాట దీక్ష' అనే టాప్ న్యూస్, అలాగే శ్రీ రెడ్డి ఇష్యు అబ్బో ఇలా 'భరత్ అనే నేను' సినిమాపై ఉండాల్సిన ఛానల్స్ ఫోకస్ కాస్తా ఇతర విషయాలపై మళ్లింది. మరి ఈ రెండు విషయాలతో భరత్ కి డ్యామేజ్ ఎమన్నా జరుగుతుందో లేదో అనేది భరత్ విజయం మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఫైనల్ గా 'భరత్ అనే నేను' హిట లేదా అనేది.

Similar News