అభిమన్యుడికి అదరగొట్టే కలెక్షన్స్..!

Update: 2018-06-20 11:49 GMT

విశాల్ - సమంత జంటగా కోలీవుడ్ లో తెరకెక్కిన ఇరంబు తిరై సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే కోలీవడ్ తో పాటుగా తెలుగులో అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయిన ఈ సినిమా జూన్ 3 న తెలుగు ప్రేక్షకులను పలకరించింది. విశాల్, విలన్ అర్జున్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు అభిమన్యుడు సినిమాని ఆకాశానికెత్తేస్తూన్నారు. మహేష్ బాబు.. అభిమన్యుడు సినిమాని లేట్ గా వీక్షించినా.. అభిమన్యుడు టీమ్ కి శుభాకాంక్షాలు తెలిపాడు. అలాగే తాజాగా హీరో నితిన్ కూడా అభిమన్యుడిని తెగ మెచ్చుకున్నాడు. మరి పాజిటివ్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమన్యుడు బాగానే కొల్లగొట్టింది. అభిమన్యుడు 18 రోజుల కలెక్షన్స్ వివరాలు.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 2.95

సీడెడ్ 0.94

ఉత్తరాంధ్ర 1.37

వెస్ట్ గోదావరి 0.67

ఈస్ట్ గోదావరి 0.42

గుంటూరు 0.62

కృష్ణ 0.70

నెల్లూరు 0.33

మొత్తం ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 8 కోట్లు

Similar News