త్వరలోనే 'అభిమన్యుడు 2'

Update: 2018-06-11 12:09 GMT

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనర్స్‌ పై ఎమ్‌.పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి.హరి నిర్మించిన చిత్రం 'అభిమన్యుడు'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్‌ టాక్‌తో రెండవ వారంలో కూడా సూపర్‌ కలెక్షన్స్‌ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వైజాగ్‌ సిఎమ్‌ఆర్‌ మాల్‌లో వేలాది మంది అభిమానులు, ప్రేక్షకులతో తమ విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా..మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ ''ముందుగా 'అభిమన్యుడు' చిత్రాన్ని ఇంత ఘన విజయవంతం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మొదటి నుండీ నన్నెంతగానో ఆదరిస్తున్నారు. ఈ విజయంతో నాకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. త్వరలోనే ఇదే టీమ్‌తో 'అభిమన్యుడు-2' మొదలు పెట్టబోతున్నాం. 'పందెంకోడి-2' విజయదశమికి రిలీజ్‌ అవుతుంది'' అన్నారు. నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ ''నిర్మాతగా ఇది నాకు చాలా పెద్ద విజయం. ఈ విజయాన్ని అందించిన విశాల్‌కి, ప్రేక్షకులకి కృతజ్ఞతలు'' అన్నారు. దర్శకుడు పి.ఎస్‌.మిత్రన్‌ మాట్లాడుతూ ''మంచి సినిమాకి ఎక్కడైనా అద్భుతమైన ఆదరణ లభిస్తుందని ఈ విజయం నిరూపించింది. ఇంత మంది సమక్షంలో విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది'' అన్నారు.

Similar News