అభిజిత్ vs సోహైల్

నాగార్జున హోస్ట్ గా ఆదివారం రాత్రి ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ హౌస్ అండ్ బిగ్ బాస్ స్టేజి అంతా ఎమోషన్ తో నిండిపోయింది. మెహబూబ్ ఎలిమినేట్ [more]

Update: 2020-11-17 11:42 GMT

నాగార్జున హోస్ట్ గా ఆదివారం రాత్రి ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ హౌస్ అండ్ బిగ్ బాస్ స్టేజి అంతా ఎమోషన్ తో నిండిపోయింది. మెహబూబ్ ఎలిమినేట్ అవడం ఎవరికీ ఇష్టం లేనట్టుగా అందరూ ఏడుపులు పెడబొబ్బలు పెట్టారు.ఇక ఆ బాధ మరిచిపోయిన హౌస్ మేట్స్ సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ కి రెడీ అయ్యారు. మరి ఎలిమినేషన్ ప్రక్రియ అంటే… మాములుగా ఉండదు. అలాగే ఈ వారం హౌస్ అంతా గరం గరంగా మారింది. హౌస్ లోని సభ్యులు ఇద్దరిని నామినేట్ చెయ్యడానికి హార్ట్ లో కత్తి దింపే ప్రక్రియలో మోనాల్ అవినాష్ ని నామినేట్ చేస్తూ హార్ట్ లో కత్తి దించడమే కాదు.. దానికి తగిన కారణం చెప్పగా అవినాష్ ఎప్పటిలాగే డీఫన్డ్ చేసుకున్నాడు. ఇక లాస్య ని అరియనా అక్కా నన్ను మీరు అరియానా నాకు పోటీ కాదన్నారంటూ నామినేట్ చేసింది.

మరి లాస్య ఊరుకుంటుందా.. ఇప్పుడూ అదే చెబుతున్న నువ్వు నాకు పోటీ కాదంటూ లాస్య అరియనతో అంది. ఇక మొదటి వారం నుండి అరుపులు కేకలు వేసిన.. సోహైల్ అందరి దృష్టిలో మంచివాడిగానే ఉన్నాడు. కానీ గత రెండు వారాలుగా నామినేట్ అవుతున్నాడు. తాజాగా సోహైల్ కి అభిజిత్ కి మధ్యన మినీ యుద్ధమే నడించింది. నువ్వు సింగరేణి ముద్దు బిడ్డవైతే.. నీ ఊతపదాలు నీ దగ్గరనే ఉంచుకో అని అభి సోహైల్ ని అనగా.. సోహైల్ నేను ఇంతే ఇట్లనే ఉంటా…. నీ కోసం మారను.. నువ్వు క్లాస్ నేను మాస్.. హాయ్ బ్రదర్, హలొ బ్రో అంటూ నేను ఉండను అంటూ రెచ్చిపోగా దానికి అఖిల్ కూడా వంత పాడాడు. మరి అఖిల్, సోహైల్ లు ఇప్పుడూ అభిజిత్ ని ఇంటికి పంపే ప్లాన్ లో ఉన్నట్టుగా కనబడుతున్నారు.

Tags:    

Similar News