బిగ్ బాస్ విన్నర్ ఫిక్స్ అయిపోయింది!!

ఇప్పటివరకు బిగ్ బాస్ సాదా సీదాగా సాగినా.. మిగిలిన నాలుగు వారాలు రసవత్తరంగా ఉంటుంది అనుకుంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 4 [more]

Update: 2020-11-23 08:08 GMT

ఇప్పటివరకు బిగ్ బాస్ సాదా సీదాగా సాగినా.. మిగిలిన నాలుగు వారాలు రసవత్తరంగా ఉంటుంది అనుకుంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ విషయంలో ఎక్కడో ఏదో డౌట్ ఉండేది. ఎందుకంటే అఖిల్, మెహబూబ్, సోహైల్ ముగ్గురు గట్టి ప్లేయర్స్. అందుకే అఖిల్ కి సోహైల్ కి అండ్ అభిజీత్ కి మధ్యన గట్టి పోటీ ఉందని భావించేవారు. కానీ ఇప్పుడు అఖిల్ మోనాల్ ని అడ్డం పెట్టుకుని బిగ్ బాస్ గేమ్ గెలవాలనుకున్నాడు.మోనాల్ ఎంత చేసినా ఆమెని వదలకుండా అఖిల్ తనని తాను కాపాడుకున్నాడని ఈ వారం బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులకు బాగా అర్ధమైంది. మోనాల్ విషయంలో అభిజిత్ తో గొడవపడి.. లవ్ ట్రాక్ నడిపినట్టుగా మోనాల్ చుట్టూ తిరిగితె మంచి ఫుటేజ్ వస్తుంది అని అఖిల్ నమ్మకం. బయట అదే జరిగింది. బిగ్ బాస్ లో మేజర్ పార్ట్ మోనాల్ – అఖిల్ షో చూడాల్సి వచ్చింది.

మరి మరో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అభిజిత్ మొదటి నుండి హౌస్ లో ఎప్పుడూ ఒకేలా ఉంటూ అందరితో మిత్రుత్వం కానీ శత్రుత్వం కానీ లేకుండా ఉన్నాడు. ఏది చెప్పాలన్నా ఫుల్ క్లారిటీతో ఉండే అభిజిత్ శనివారం ఎపిసోడ్ లో నాగ్ దగ్గర అఖిల్ విషయం ప్రస్తావించిన తీరుకి అందరూ అభిజిత్ ఫాన్స్ అయ్యిపోయారు. మామూలుగానే అభిజిత్ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉన్నా.. ఒక టైం లో గాలి అఖిల్ వైపే వీచింది. కానీ ప్రసుతం సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఇక ఆదివారం కూడా అభిజిత్ సేవ్ అయ్యి.. స్ట్రాంగ్ గా కనిపించడమే కాదు.. ఎలిమినేట్ అయ్యి బయటికెళ్లిన లాస్య కూడా అభిజిత్ టాప్ 2 లో ఉండబోయే కంటెస్టెంట్ అంటూ చెప్పేసింది.

Tags:    

Similar News