అభిజిత్ ఈ సీజన్ వరెస్ట్ పెరఫార్మర్ అంట!

బిగ్ బాస్ సీజన్ 4 బోర్ కొట్టినట్టుగా మరే సీజన్ లోను ఇంత బోర్ కొట్టలేదు.ఆసక్తికర టాస్క్ లు లేవు. ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ లేరు. లాస్ట్ వీక్స్ [more]

Update: 2020-12-06 08:25 GMT

బిగ్ బాస్ సీజన్ 4 బోర్ కొట్టినట్టుగా మరే సీజన్ లోను ఇంత బోర్ కొట్టలేదు.ఆసక్తికర టాస్క్ లు లేవు. ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ లేరు. లాస్ట్ వీక్స్ లో బిగ్ బాస్ హౌస్ ఏమోషన్స్, కంటెస్టెంట్స్ కొట్లాట ని హైలెట్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న అఖిల్, అవినాష్, అభిజీత్, మోనాల్, హరికలలో ఎవరు ఇంటి నుండి బయటికి వెళతారో తెలియదు కానీ.. టాప్ 5 లోకి మాత్రం టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి.. అఖిల్ ఫస్ట్ టాప్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ లోకి అడుగుపెట్టాడు. సోహైల్ – అఖిల్ హోరా హోరీగా ఆడినా.. సోహైల్ ఉయ్యాలా నుండి దిగిపోవడంతో అఖిల్ టాప్ 5 లోకి వెళ్లబోతున్నాడు. కానీ ఈ వారం ఎలిమినేట్ అవ్వకపోతేనే అఖిల్ టాప్ లోకి వెళ్లే ఫస్ట్ కంటెస్టెంట్ అవుతాడు.

ఇక ఈ సీజన్ బెస్ట్ పెరఫార్మెర్, వరెస్ట్ పెరఫార్మర్ కోసం బిగ్ బాస్ నెంబర్ గేమ్ టాస్క్ పెట్టాడు.  ఏడుగురిలో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు 3rd, ఎవరు 4th , ఎవరు చివరి పొజిషన్ లో ఉంటారో తేల్చుకోమంటే సోహైల్ ఫస్ట్ పొజిషన్, అరియనా సెకండ్, మోనాల్ 3rd, హారిక 4th, అవినాష్ 5th లో ఉండగా.. అభిజీత్ ఈ సీజన్ వరెస్ట్ పెరఫార్మెర్ గా చివరి స్థానాన్ని ఎంచుకున్నాడు. అయితే గత వారం అభిజీత్ ఓ టాస్క్ పెరఫార్మెన్స్ సరిగ్గా చెయ్యని కారణంగా వరస్ట్ పెరఫార్మెర్ స్థానాన్ని తీసుకున్నాడు. సోహైల్ మాత్రం ఈ సీజన్ బెస్ట్ పెరఫార్మెర్ గా నిలిచాడు. అభిజిత్ మొదటి నుండి డల్ పెరఫార్మెర్ గానే ఉన్నాడు. కాకపోతే మెచ్యూరిటీ ఉన్న కంటెస్టెంట్స్ గా అభిజిత్ స్ట్రాంగ్ తప్పితే టాస్క్ ల పరంగా వీక్. అరియనా – సోహైల్, హరిక, అవినాష్, మోనాల్ తమ స్థానాల కోసం కొట్లాడినా చివరికి ఎమోషన్స్ ని జయించలేకపోయారు. ఇక ఈ సీజన్ వరెస్ట్ పెరఫార్మెర్ గా ఉన్న అభిజీత్ ని బిగ్ బాస్ జైలు కి పంపించాడు. ఖైదీ డ్రెస్ వేసుకుని మరీ అభిజిత్ జైలుకెళ్లాడు.

Tags:    

Similar News