ఎన్టీఆర్ అండ్ అభయ్ ల ముచ్చట్లు

Update: 2018-05-20 07:51 GMT

ఎన్టీఆర్ తన సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ తో మాత్రమే ఫ్యాన్స్ ని ఫిదా చెయ్యలేదు.. తన కొడుకు అభయ్ రామ్ తనకి మొదటగా బర్త్ డే విషెస్ చెప్పాడని.. తన ఆనందాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. నేడు ఆదివారం మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత.. వీర రాఘవ' అంటూ టైటిల్ ఎనౌన్స్మెంట్ తో పాటుగా ఎన్టీఆర్ మాస్ లుక్ ని విడుదల చేసింది హారిక అండ్ హాసిని నిర్మాతలు. అలాగే 'అరవింద సమేత' మోషన్ పోస్టర్ ని విడుదల చేసి ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ ని తెలియజేసారు... 'అరవింద సమేత' టీమ్ సభ్యులు.

ఇక ఇండస్ట్రీ లోని పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా పుట్టిన రోజు నాడు తన కొడుకు తనకు మొదటిగా శుభాకాంక్షలు చెప్పడం తనకి సంతోషాన్నిచ్చిందని ... అలాగే తన కొడుకు అభయ్ రామ్ చాలా పెద్దోడు అవుతున్నాడని... ఫైనల్లీ, అభయ్ నా కళ్ళు ముయ్యడం ఆపేసాడు. అభయ్ రామ్ చాల పెద్ద వాడవుతున్నాడు. అయినా.. నాకు మొదటిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు అంటూ... తన భుజాల మీద అభయ్ రామ్ కూర్చున్న ఫోటో ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇప్పుడు ఎన్టీఆర్ అభయ్ రామ్ ని భుజాల మీద ఎత్తుకున్న ఆ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ అభిమానులైతే ఎన్టీఆర్ అండ్ అభయ్ రామ్ ఫోటో ని తెగ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

Similar News