ఫిబ్రవరి 8న ఏబీసీడీ..!

Update: 2018-11-03 09:43 GMT

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా, కోటా శ్రీనివాసరావు, శుభలేక సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియాలో చివరి షెడ్యూల్ చేసేందుకు ప్లాన్ చేశారు. అమెరికాలో జరిగే షెడ్యూల్ తో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 15 నాటికి షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Similar News