శ్రద్ధా కంటే ఆలియా మీదే అందరి ఫోకస్

సాహో చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుందని తెలిసినప్పుడు అందరూ ఓ అన్నంత వింతగా ఏమీ చూడలేదు. ప్రభాస్ రేంజ్ పెరిగింది, సాహో సినిమాని నేషనల్ [more]

Update: 2019-04-11 11:22 GMT

సాహో చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుందని తెలిసినప్పుడు అందరూ ఓ అన్నంత వింతగా ఏమీ చూడలేదు. ప్రభాస్ రేంజ్ పెరిగింది, సాహో సినిమాని నేషనల్ వైడ్ గా తెరకెక్కిస్తున్నారు కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారని అన్నారు. అలాగే అప్పటికి శ్రద్ధా దాస్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్స్ హిట్స్ లో ఏమీ నటించలేదు. కాబట్టి సాహో సినిమాకి శ్రద్ధా హీరోయిన్ అన్నప్పటికీ జనాల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ #RRRలో నటిస్తుంది అనగానే అందరి అటెన్షన్ అలియా మీదకే మళ్లింది.

ఆలియాకు ఫుల్ క్రేజ్

ఇక మెగా ఫాన్స్ అయితే గూగుల్ లో అలియా భట్ ని తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలే ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో అలియా బాలీవుడ్ లో దూసుకుపోతున్నవేళ రాజమౌళి #RRR కోసం ఆమెని తీసుకురావడం కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం వెయ్యి కోట్లతో రూపొందుతున్న పలు భారీ బడ్జెట్ సినిమాల్లో అలియా నటిస్తుంది. అందుకే సాహోతో శ్రద్ధకి రాని క్రేజ్ ఇక్కడ #RRRతో అలియాకి వచ్చేస్తుంది. అందుకే అలియా భట్ ఏ అవార్డు ఫంక్షన్స్ లో, ఏ పార్టీలో కనబడిన టాలీవుడ్ మీడియా ఫోకస్ మొత్తం ఈ బాలీవుడ్ చిన్నదాని మీదే ఉంటుంది. అలియా ఆ డ్రెస్ వేసుకుంది.. అలియా ఈ డ్రెస్ వేసుకుంది అంటూ తెగ వార్తలు రాసేస్తుంది.

Tags:    

Similar News