ఆచార్య కథ అదేనా?

చిరంజీవి – కొరటాల సినిమా టైటిల్ కూడా రివీల్ అయ్యింది. ఆచార్య గా చిరంజీవి కొరటాల శివ సినిమాలో  మెరిపించడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఈసినిమాలో చిరు [more]

Update: 2020-03-04 10:03 GMT

చిరంజీవి – కొరటాల సినిమా టైటిల్ కూడా రివీల్ అయ్యింది. ఆచార్య గా చిరంజీవి కొరటాల శివ సినిమాలో మెరిపించడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఈసినిమాలో చిరు నక్స లైట్ గా కనబడతాడని, ఇంతకుముందు చిరు లుక్ లీకైన దాన్నిబట్టి… చిరు మాస్ లుక్ చూసి చిరు మాజీ నక్సలైట్ అనేది కన్ఫర్మ్ అంటున్నారు. ఇప్పటికే బాగా బరువు తగ్గి చిరు చాలా యంగ్ గా కనబడుతున్నాడు. బయట కూడా టి షర్ట్స్ వేస్తూ నాకింకా 40 అనే బిల్డప్ లోనే చిరు చాలా ఫిట్ గా కనబడుతున్నాడు. ఒకప్పుడు నక్సలైట్ గా ఉన్న చిరు పాత్ర తర్వాత మాజీ నక్సలైట్ గా ఆచార్య గా మారి దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగిన అవకతవకలు బయటపెట్టి.. దానిమీద పోరాడతాడని అంటున్నారు. ఇక మరో యంగ్ హీరో నటించే పాత్ర స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతుంది అంటున్నారు.

అయితే ఆ యంగ్ హీరో పాత్రకి మహేష్ చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో నడుస్తుంది. మరోపక్క మహేష్ కాదు చిరు కొడుకు రామ్ చరణే ఆ పాత్ర చేయబోతున్నాడని అంటున్నారు. మహేష్ చేస్తాడని చెప్పిన పాత్రలో చరణే కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ రోల్ అయితే సినిమాలో 20 నుండి 25 నిముషాలు ఉండబోతుంది అని.. మహేష్ చేస్తే సినిమాకి భారీగా హైప్ వచ్చేది అని, ఇక చరణ్ చేసినా సూపరే అంటున్నారు మెగా ఫాన్స్. మరి ఆచార్య స్టోరీ ఇదే అంటూ చిరు మాజీ నక్సలైట్ గా కనిపిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే మోసాలపై చేసే పోరాటాన్ని స్టోరీ లైన్ గా చెబుతునాన్రు. ఇక కొరటాల దీన్ని ప్రేక్షకులు మెచ్చేలా పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడట.

Tags:    

Similar News